ఇదే శివం. నిశ్రేయసం. Summum Bonum సకల పురుషార్ధాలూ ఒక్కటే సాధించి పెట్టగలదు మానవుడికి. త్య్రంబక నారాయణి గదా ఆవిడ. తృతీయ నేత్రం జ్ఞానానికి చిహ్నమైతే నారాయణత్వం దానివల్ల అందుకొనే పరమ పదానికి సూచకం. ఆవిడనే శరణ్యమని నమ్మిన వాడి కలాటి మహాఫలాన్ని ప్రసాదించటంలో సందేహం లేదు.
సక్తు మివ తిత ఉనాపునంతో - యత్ర ధీరా మనసావాచ మక్రత - అత్రా సఖాయ స్సఖ్యాని జానతే - భగ్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి
తితఉ అంటే సంస్కృతంలో జల్లెడ అని అర్ధం. సక్తువంటే పిండి. పిండి జల్లెడ పడితే శుభ్రంగా ఉంటుంది. అలాగే వాక్కును జల్లెడ పట్టారట పూర్వం ప్రజ్ఞావంతులైన ఋషులు. వాక్కునెలా జల్లించ గలిగారంటే మనస్సుతో. వాక్కంటే అది రెండు విధాలు. ఒకటి అనాహతం మరొకటి ఆహతం. ఆహతం నోటితో ఉచ్చరించేదైతే అనాహతం మనసులో కలిగే సంకల్పం. దాన్ని పట్టి మొదట పరిశుద్ధం చేసుకోవాలి. సవికల్పం గాక నిర్వికల్ప మైనప్పుడే అది పరిశుద్ధి చెందటం. అలాటి శోధన చేసి అచలమైన స్థితి నందుకొన్న వాడే ధీరుడు.
అలాటి ధీరులైన మహర్షులకు సజాతీయమైన ధీ బలమున్నవారే వారికి సఖులు. సఖిత్వమంటే సాజాత్యం. ఆస్థాయి నందుకొన్న పెద్దలే వారికి కలిగిన ఆత్మానుభవమేదో దాన్ని తమ అనుభవానికి తెచ్చుకోగలరు
Page 53