#


Index

  కాగా మనః ప్రాణాలు రెండే జీవ భావం గనుక అవి రెండూ సోమమంటే జ్ఞానామృత పానం చేసి పవిత్రమైతే చాలు. పరమాత్మ సాయుజ్యమనే ధనం మూట గట్టు కోగలడు మానవుడు. యస్య బ్రహ్మ చ క్షత్రంచ ఉభే భవత ఓదనః అనే కఠోపనిష ద్వాక్య తాత్పర్యమిదే.

న క్రోథో నచ మాత్సర్యం నలోభో నాశుభా మతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం - శ్రీసూక్తం జపేత్సదా

  అసలు క్రోధం గాని మత్సరం గాని లోభం గాని మలినమైన మనస్సు గాని ఏ అవగుణాలూ ఏర్పడవు పుణ్యాత్ములైన దేవీ భక్తులకు. భక్తి ఒక్కటే వాటన్నిటినీ దూరంగా పారదోలగలదు. అంటే బ్రహ్మాకార వృత్తే అన్ని అసుర వృత్తులకూ జవాబు చెప్పగలదని అర్థం. అంచేత నిత్యమూ అలాటి శ్రీ దేవతా సంబంధి అయిన స్తోత్రం జపించట మెంతైనా లాభదాయకం. శ్రేయోదాయకం.

వర్షంతు తే విభావరి - దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వ బీజాని అప బ్రహ్మ ద్విషో జహి-

  ఇంకా వర్ణిస్తున్నాడా బ్రహ్మాకార వృత్తిని. విభా అస్యాస్తీతి విభావరీ. విభావరి అంటే రాత్రి అని కాదిక్కడ. విభా అంటే అఖండమైన ప్రకాశం. అది దేనికుందో అది బ్రహ్మ విద్య. తే అది నీ స్వరూపమే గనుక. ఓ విభావరీ శ్రీ దేవతా దివో అభ్రస్య విద్యుతః వర్షంతు -

Page 46