#


Index

  ఇక్కడ బయటపెడుతున్నాడిప్పుడా అంతరార్థమేమిటో. అగ్నీ వాయువూ సూర్యుడూ వసువూ ఇంద్రుడూ బృహస్పతీ వరుణుడూ అంటున్నామంటే ఆ దేవత లెవరో కారు ధనమే. ఆ ధనాన్ని పట్టుకొంటే మనం ధనవంతులమై పోగలం. ఆంతర్య మేమంటే అగ్ని మనస్సూ వాయువు ప్రాణమూ - సూర్యుడు బుద్ధి - వసువులు ఇంద్రియాలూ ఇంద్రుడు జీవుడి అహంకారమూ - బృహస్పతి అతని వాక్కు. వీటికవి సంకేతాలు. ఇవన్నీ మానవుడి ఇంద్రియ సంఘాతమే కాబట్టి భగవద్దత్తమైన ధన మార్జించి జ్ఞాన ధన సంపన్నులం కావాలని భావం.

వైన తేయ సోమంపిబ సోమం పిబతు వృత్త హా సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినీ

  సోమిని అంటే పరమేశ్వరుడితో అనపాయిని అయిన మాయాశక్తి సోముడాయన అయితే సోమిని ఆవిడ ధనికుడయిన ఆ సోముని సోమమనే ధనాన్ని నాకీ సోమిని ప్రసాదించు గాక అని ఆకాంక్ష. అది ఎలా నెరవేరుతుంది. ప్రాణమూ మనస్సూ రెండూ సోమపానం చేయగలిగితే నెరవేరుతుంది. వైనతేయుడంటే గరుత్మంతుడు. గరుత్తులంటే రెక్కలు. ప్రాణ గమనాగమనాలే ఆ రెక్కలు. అవి కలిగిన ప్రాణ శక్తే వైనతేయుడైన గరుత్మంతుడు. పోతే వృత్రహా వృత్తా సురుణ్ణి చంపినవాడు. వృత్తాసురుడు చిత్తవృత్తి కదంబమే. అది మనస్సుకు సంకేతం.

Page 45