#


Index

  రధాది వాహనాలూ ఇలా జీవితానికి కావలసిన సౌకర్యాలన్నీ నాకు నీవే ప్రసాదించగలవు. ప్రజలందరికీ నీవే మాతవు. కనుక అన్నీ నీవే నీకన్న సంతానమైన మాకందివ్వాలి. అన్నిటితో పాటు వాటి ననుభవించ టానికి దీర్ఘాయుస్సు కూడా మాకు ప్రసాదించు తల్లీ.

చంద్రాభాం లక్ష్మీమీ శానాం - సూర్యాభాం శ్రియ మీశ్వరీమ్ చంద్ర సూర్యాగ్ని సర్వాభాం - మహాలక్ష్మీముపాస్మహే -

  మహాలక్ష్మివైన నీవెవరో గావు. ఈశ్వర చైతన్యాన్ని ఆశ్రయించిన ఈశ్వరివి. చంద్ర సూర్యాగ్ని సంబంధి అయిన ప్రకాశాలన్నీ నీవే. అలాటి దానవు గనుకనే నాకు ఐహికమైన వన్నీ ఇవ్వగలవు. అలాగే వీటి ద్వారా ఆముష్మికమైన మోక్ష మార్గాన్ని కూడా చూపగలవు. కనుక నిన్నే నేనుపాసన చేసి తరిస్తానంటాడు సాధకుడు. ఏమి కారణం. అశ్వాదుల దగ్గరి నుంచీ సూర్యాగ్నుల వరకూ అన్ని పదార్ధాలూ ఆ మహాశక్తి ఉపాధులే. Media. ఉపాధులే ద్వారాలు గమ్యం చేరటానికి. కారణం. దాని వ్యక్తమైన రూపాలే ఇవన్నీ. కనుక ఈ వ్యక్తమైన ఉపాధులే అవ్యక్తమైన ఆ చైతన్య శక్తిని మనకు స్ఫురింప జేస్తాయి. ఇవన్నీ కావాలని కోరటంలో ఇదీ తాత్పర్యం.

ధన మగ్నిర్ధనం వాయు - ర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతి - ర్వరుణం ధనమశ్నుతే -

Page 44