#


Index

  అలాటి మహాశక్తిని విద్యా స్వరూపిణిగా భావించి నన్ను ఆ రూపంతో భజించమని వేడుతున్నాడు సాధకుడు. ఏమని. అమ్మా నీవు పద్మం నుంచి జన్మించావు. కనుక నీ ముఖమూ ఊరువులూ అక్షులూ అన్ని అవయవాలూ పద్మాకృతులే. అలాటి నీవు నన్ను ఆశ్రయిస్తే తద్బలంతో నేను అన్ని సౌఖ్యాలూ పొందగలను. పద్మమంటే ఇక్కడ అండ పిండాది గోళాలు గనుక వాటన్నిటినీ వ్యాపించిన చైతన్య శక్తి నావాహన చేసుకొంటే తదాకార వృత్తి ఏర్పడి తరించగలనని సాధకుని తాత్పర్యం.

అశ్వదాయీచ గోదాయీ - ధన దాయీ మహా ధనే - ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే

  అశ్వాలను గోవులనూ ధనాలనూ - అన్నింటినీ దానం చేస్తావు. నీవు. అలాంటి శక్తి నీకున్నది. నీవు మహాధనవు. కనుకనే అన్నీ మాకీయ గలవు. అలాటి ధనమంతా నాకు ప్రసాదించు తల్లీ. ధనమూల మిదం జగత్. సకలమైన కామ్యములూ మాకు దానివల్లనే ఫలించగలవు. అంతేకాదు.

పుత్ర పౌత్రం ధనం ధాన్యం - హస్త్వశ్వావి గో రథమ్ ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్ -

  పుత్రులూ పౌత్రులూ - వారి పోషణకు ధనధాన్యాలూ - అక్కడా ఇక్కడా తిరగటానికి ఏనుగులూ గుఱ్ఱాలూ గొట్టెలూ మేకలూ గోవులూ

Page 43