నిష్కలం నిష్క్రియం శాంతమన్నారు బ్రహ్మతత్త్వాన్ని. పంచదశీ మంత్రం దానికి దారి తీయాలి. అది అఖండ జ్ఞానరూపంగా మారితే పంచదశి కాదది. షోడశి అంటారు దాన్ని హస కహల హ్రీం అని ఇత్యాదిగా ఉన్న పంచదశి జ్ఞానాగ్నిలో ఆహుతి అయి షోడశిగా మారుతుందప్పుడు. అలా మారితేనే అది కేవలం భోగాన్నే గాక అపవర్గాన్ని కూడా ప్రసాదిస్తుందీ సాధకుడికి. ఇదీ ఇందులో గుప్తమయి ఉన్న పరమార్ధం.
ఆనందః కర్దమ శ్చైవ - చిక్లీత ఇతి విశ్రుతాః - ఋషయస్తే త్రయః పుత్త్రిః - స్వయం శ్రీ రేవ దేవతా -
ఆనంద చిక్లీత కర్దములని ముగ్గురు ఋషులున్నారు చాలా ప్రసిద్ధులు. వీరు ముగ్గురూ శ్రీ మాత కుమారులే. కాగా శ్రీ మాత స్వయంగా దేవతా స్వరూపిణి. అంతరార్థ మేమంటే శ్రీదేవి ఎవరో గాదిక్కడ. పరమాత్మ నాశ్రయించి ఉన్న మాయాశక్తి. ఆవిడ కుమారులని ప్రసిద్ధులైన ఆనందాది ఋషులెవరో కారు. సత్త్వరజస్తమో గుణాలే. అందులో సత్త్వ మానందం. కర్దమం తమస్సు. పోతే చిక్లీత రజస్సు. వీరు ఋషులంటే అర్ధం మనః ప్రాణ శరీరాలుగా మారి ఆ గుణాలు బాహ్య ప్రపంచాన్ని నిత్యమూ దర్శిస్తుంటాయని.
పద్మాననే పద్మ ఊరు - పద్మాక్షీ పద్మ సంభవే - త్వం మాం భజస్వ పద్మాక్ష్మి - యేన సౌఖ్యం లభా మ్యహమ్
Page 42