#


Index

పూర్వోక్తము

  శ్రీ సూక్తమూ - పురుష సూక్తమూ - మంత్ర పుష్పమూ - ఇవి మూడూ పంచ సూక్తాలలో చాలా ముఖ్యమైన సూక్తాలు. సూక్తమంటే సుభాషితం. బాగా చక్కగా చెప్పబడినది Well Said అని అర్ధం. అయితే శాబ్దికంగానే చెవిన బడ్డా మనం దాన్ని వల్లించినా పారాయణం చేసినా ప్రయోజనం లేదు. ఆర్థికంగా దాన్ని మనసుకు పట్టించుకొంటే సూక్తమనే మాట మన పట్ల సార్ధక మవుతుంది. ఈ అర్ధం కూడా కేవలం ప్రతి పదార్ధమే అయితే మరలా సుఖం లేదు. బాహ్యార్ధాన్ని దాటి అంతరార్ధం వరకూ ప్రయాణం చేయాలి. అది చివరకు పరమార్ధాన్నే అందించాలి మనకు. అప్పుడే సూక్త పాఠం సంపూర్ణంగా చరితార్ధ మవుతుంది. మనమూ కృతార్థుల మవుతాము.

  కాని నేనిప్పటికి 30-40 సంవత్సరాల నుంచీ చూస్తున్నాను. ఈ మూడింటినీ దేవాలయాల దగ్గరి నుంచీ మన ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాల వరకూ అర్చక స్వాములూ పురోహితులూ గుక్క తిప్పుకోకుండా వల్లిస్తుంటారే గాని వారి కీషతైనా తాము వల్లించే మంత్రాల కర్థం తెలిసినట్టు నాకే మాత్రమూ తోచటం లేదు.

Page 4