#


Index

  కాని ఎలాగని. అభూతి మ సమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్. అభూతి ఒకటీ అసమృద్ధి ఒకటీ ఈ రెండూ నా ఇంట్లో నుంచి బయటికి త్రోసి వేయమని ఆ శ్రీ దేవిని మనసారా ప్రార్ధించాలి. భావనా గమ్య అని గదా ఆవిడ పేరు. నీవలా భావిస్తే ప్రసన్నురాలయి నీకు ప్రతికూలమైన ఆ రెంటినీ గెంటి వేసి అనుకూలమైన భూతి నీ సమృద్ధినీ నీకు ప్రసాదిస్తుంది. అభూతేమిటి అసమృద్ధేమిటి. అభూతి అంటే నేనీ శరీరం మేరకే గాక బాహ్యంగా కూడా సర్వత్రా సచ్చిద్రూపంగా ఉన్నాననే భావం లేకపోవటం. అదే జీవ భావం. ఇది తొలగిపోతే భూతి అవుతుందది. అది ఈశ్వర భావం. అలాటి ఈశ్వర భావమందు కోలేకపోతే అది అసమృద్ధి. అందుకో గలిగితే సమృద్ధి. కాబట్టి ఆ అభూతి అసమృద్ధి అనే దోషాలు నిర్మూలించి భూతి సమృద్ధుల నిమ్మని వేడుకోవాలా మహాశక్తిని. ఇక్కడ నా ఇంటి నుంచి నెట్టి వేయమంటే అర్ధం కేవలం నేను నివసించే గృహమనే గాదు. మనస్సనే గృహం నుంచని అర్థం చెప్పుకొంటే ఇంకా బాగుంటుంది. అసలదే అంతరార్థం.

గంధ ద్వారాం దురాధరాం -
నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వ భూతానాం -
తామిహోపహ్వయే శ్రియమ్

  సరే మన సాధన మార్గాని కడ్డు పడేదంతా త్రోసి పారేయాలన్నారు. విభూతి సమృద్ధి కావాలని కోరుకొన్నారు. బాగానే ఉంది.

Page 31