అంచేత కీర్తి మృద్ధిం దదాతుమే అమ్మా మహాశక్తీ నాకు బయట పడే మార్గాన్నీ దానికి తగిన సామర్థ్యాన్నీ ప్రసాదించమని వేడుకోవాలి ప్రతివాడూ. అప్పుడావిడ విద్యారూపిణి కూడా గనుక లక్ష్మి అయి మనకు తరించే మార్గాన్ని చూపుతుంది.
మార్గాని కడ్డు పడుతుందేది. క్షుత్పి పాసా మలాం జ్యేష్ఠా మ లక్ష్మీమ్. అలక్ష్మే మోక్ష మార్గాని కడ్డుపడే బండరాయి. అది లక్ష్మి గాదు అలక్ష్మి. దారి చూపదు. ఎక్కడిదీ అలక్ష్మి. ఎలాంటిది. జ్యేష్ఠ అది. అంటే మొదటి నుంచీ మనల నంటి పెట్టుకొని ఉన్నది. అదేదో గాదు. అనాది సిద్ధమైన మానవుడి అజ్ఞానమే. జ్ఞానోదయం కానంత వరకూ ఉన్నది మన కజ్ఞానమే గదా. అంచేత అది జ్యేష్ఠ. లక్ష్మీదేవి కన్నా పెద్దది వయసులో ఈ జ్యేష్ఠాదేవి. ఎలా ఉంటుంది దీని చహరా అని అడుగుతారా. క్షుత్పిపాసా మలాం. క్షుత్తూ పిసాసా దీని లక్షణాలు. మలాం. అలాటి మాలిన్యాన్ని దగ్గర పెట్టుకొని బ్రతుకుతున్నది. క్షుత్పిపాసలంటే ఆకలి దప్పులు అవి సూక్ష్మ శరీరోపాధి అయిన జీవుడి లక్షణాలు. వాడే తైజసుడు. అసలైన జీవుడు. అప్పటికీ జీవ భావమే మాలిన్యమని తేలిపోయింది.
తేలింది. బాగానే ఉంది. వ్యాధి ఏదో తెలిసింది. మరి దీన్ని పోగొట్టుకొనే మార్గమేమిటి. అదే చెబుతున్నాడు. అలక్ష్మీం నాశయా మ్యహమ్. మార్గం నాకు చూపకపోగా నా మార్గానికి శత్రువైన దీన్ని రూపుమాపుతానని నడుము కట్టాలట మానవుడు. కట్టాలనే మాట బాగానే ఉంది.
Page 30