#


Index

  సంసార భావనతో సంసార బంధం ప్రాప్తించి నట్టే సాయుజ్య భావనతో మరలా సాయుజ్య సుఖమే లభిస్తుంది. అసలు మనకెందుకీ ప్రయాస అంటారేమో. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రీస్మిన్ - కీర్తి మృద్ధిం దదాతుమే. ప్రయాస మనం పెట్టుకొన్నది. గాదు. మనకు జన్మతోనే వచ్చింది ప్రయాస అనేది. అదే ఈ జీవ భావం. దేహమే నేననే భావ మెప్పుడేర్పడిందో అప్పుడే ప్రయాస ఆరంభమయింది. అదే మనకీ సుఖదుఃఖా దికమైన సంసారాను భవం. ఇది మనకు తెలియ కుండానే వచ్చి నెత్తిన పడ్డది. అదే చెబుతున్నది మంత్రం. రాష్లేస్మిన్. రాష్ట్రమంటే ఈ శరీరం. ఇది మనం పుట్టినప్పటి నుంచీ ధరించే ఉన్నాము. కనుక ధృతరాష్ట్రులం మనమంతా. పుట్టుకతోనే గ్రుడ్డివాళ్లం. అంటే జ్ఞానమనే వెలుగుకు నోచుకోలేదు. కారణం ప్రాదుర్భూతోస్మి. దురదృష్టవశాత్తూ వచ్చి పడ్డా మిందులో. ఈ బందిఖానాలోనే జన్మ ఎత్తాము.

  తెలియకుండా ఇందులో వచ్చి ఇరుక్కుపోయాడు గనుకనే ప్రతి మానవుడూ మరలా ఇందులో నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. లేకుంటే ఇక్కడే పుట్టి ఇక్కడే గిట్టే ప్రమాదానికి గురి అవుతాడు. తెలియకుండా తెచ్చుకొన్నది సమస్య అయితే తెలిసి బయట పడటం పరిష్కారం. అజ్ఞానానికి విరుగుడు జ్ఞానమే గదా.

Page 29