marrege matching Advaita Vedanta
#


Index

  అలక్ష్మి ఏదో గాదు. జ్యేష్ఠాదేవి. పెద్దమ్మ వారు. లక్ష్మి కంటే ముందుగా పుట్టింది సాగరంలో. అంటే సంసార సాగరంలో. అందుకే పెద్దమ్మ అయిందది. సజాతీయ భావన వల్లనే విజాతీయం తొలగిపోతుంది. సజాతీయ భావమెలా కలుగుతుంది.

ఉపైతు మాందేవ సఖః
కీర్తిశ్చ మణినా సహ
స్రాదుర్భూతో 2 స్మిరాష్ట్రీస్మిన్ -
కీర్తి మృద్ధిం దదాతు మే

  అనులోమంగా ఒకటి సాధించినప్పుడే ప్రతి లోమమైనది బాధిత మయి పోతుంది. ఇదీ సూత్రం. అందుకే అభ్యాసం మొదట వైరాగ్యం తరువాతా చెప్పారు. ఏమిటా అభ్యాస మిక్కడ. క్రియారూపం కాదది. Actual భావరూపం Ideal. నిరంతరమూ భావన చేస్తూ పోవాలా బ్రహ్మ భావాన్ని. దేవసఖః అది దేవసఖం. దీవ్యతీతి దేవః ఏది ఎప్పుడూ స్ఫురిస్తుంటుందో అది దేవ. అది మన మనస్సే. దానికి సఖ అంటే అంటి పట్టుకొని ఉండేది. అలాటి బ్రహ్మ భావం ఉపైతు మాం. నాలో ప్రవేశించు గాక అనే ఆకాంక్షతో భావన చేయాలి. అలా చేస్తూ పోతే ఏమవుతుంది. కీర్తిశ్చ మణినా సహ. రత్నం లాంటి ఆ విలువైన భావం దానితో పాటు దాని విభూతీ పదహారు కళలతో మనలో ప్రకాశిస్తుంది. యద్భావ స్తద్భవతి అన్నారు. భావితం తీవ్ర వేగేన. ఏది తీవ్రంగా భావిస్తే అదే మనకు ప్రాప్తిస్తుంది సందేహం లేదు.

Page 28