న రూప మస్యేహ పలభ్యతే నాంతో నచాది రచ సం ప్రతిష్ఠా. ఆది మధ్యాంతాలు లేనిదిది. కనుకనే పైకి ఒక రూపంలో కనిపిస్తున్నా అది ఆ భాసే. వస్తువు కాదు. వస్తువు చైతన్యం. అది బీజమైతే అది శాఖోప శాఖాత్మకంగా విస్తరించి కనిపించటమే ఈ సంసార వృక్షం.
అందులో కూడా మామూలు వృక్షం కాదు. బిల్వ వృక్షం బిల్వమంటే మారేడు. రెండో మూడో దళాలుంటాయి దానికి. రెండుంటే ద్వంద్వాత్మకం. మూడుంటే త్రిగుణాత్మక మనుకోండి. అసలు వృక్షాలలో రెండు రకాలున్నాయి. పూయకుండా ఫలించే దొకటైతే పుష్పించి ఫలించేది మరొకటి. వానస్పత్యః ఫలైః పుష్పా - త్తైరపుష్పా ద్వనస్పతిః అన్నారు సైఘంటికులు – Lexico Graphars. ఇది వనస్పతి ఈ సంసార వృక్షం. పూలు లేకుండా ఫలించిన వృక్షం. అంటే ఎలాటి కారణమూ చూపటానికి లేదు దీని ఆవిర్భావానికి. అనిర్వచనీయం. వాస్తవంగా జన్మించలేదిది. అయినా కనిపిస్తున్నది. అందుకే ఆ భాస అన్నారు దీన్ని. స్వప్నంలో చూచే వృక్షం లాంటిది. లోకంలో బిల్వవృక్షం కూడా పుష్పించ కుండా కాయలు కాస్తుంది. కనుకనే దానితో పోల్చారు సంసారాన్ని. అంతేకాదు. బిలం చేసేదేదో అది బిల్వం. బిలమంటే ఖాళీ. మారేడు కాయ ఖాళీ చేస్తే అది మారేడు బుఱ్ఱ. అలాగే దీన్ని కూడా బ్రహ్మ భావనతో చూస్తే ఖాళీ అవుతుంది. అప్పుడిది వట్టిదే. హుళక్కి. తనపాటికి తాను వట్టిదే అయినా పూర్ణ స్వరూపంగా భావన చేస్తే తదాకారంగా పూర్ణమే మరలా అందుకే ఏకబిల్వం శివార్పణ మన్నారు.
Page 26