భౌతికమైన ఆదిత్య మండలానికే ఉదయాస్తమయాలు అభౌతికమైన ఆత్మ చైతన్యానికి ఉదయాస్తమయాలనే ప్రసక్తే లేదు. అందుకే సకృత్ప్రభాత అని కూడా వర్ణిస్తారు దాన్ని. సకృత్తంటే నిత్యమూ ప్రభాత అంటే ప్రకాశించేదని అర్థం.
అలాటి ఓ మహాశక్తీ తపసో2 థిజాతో వనస్పతి స్తవ వృక్షోథ బిల్వః - నీవు తపస్సు చేశావు. ఆ తపస్సు వల్లనే జన్మించింది ఒక వృక్షం. దాని పేరే బిల్వం. ఆవిడ తపస్సు చేయటమేమిటి. దానివల్ల ఒక బిల్వ వృక్షం జన్మించట మేమిటి. ఆశ్చర్యంగా లేదూ. అంతరార్థం తెలుసుకొంటే ఏమీ ఆశ్చర్యం లేదు. తపస్సంటే ఆలోచన సంకల్పం. యస్య జ్ఞాన మయం తపః అన్న దుపనిషత్తు. సతపో తప్యత అని కూడా పేర్కొన్నది. పరమాత్మ చేసిన తపస్సాయన ఆలోచనే సంకల్పమే. దానికే ఈక్షణమని కూడా ఒక నామధేయం. తదైక్షత. అది చూచిందట. పరిపూర్ణమైన జ్ఞానం గదా అది. అందుకే ఆలోచించ గలదు. చూడగలదు. ఏమని చూచింది. బహుస్యాం ప్రజాయే యేయ. అనేకమయి పోదామని. అదే ఈ చరా చర ప్రపంచం. ఇది వాస్తవం కాదీ సృష్టి. ఆ పరమాత్మ సంకల్పం లేదా భావనా రూపం. చైతన్య వివర్తమే సంసారం.
అదే వర్ణిస్తున్నదీ మంత్రం. నీ తపస్సు వల్లనే జన్మించిందీ వృక్షమని. వృక్షమంటే యధార్థమైన వృక్షం కాదిది. వృక్షం లాగా దృష్ట నష్ట స్వభావం గనుక వృక్షంతో పోల్చి చెప్పారు.
Page 25