అలక్ష్మి అంటే అలా చూపకుండా మనలనీ సంసార కూపంలో పడేసేది అని అర్ధం. మొదటిది అనుకూలం. రెండవది ప్రతికూలం. శక్తి ప్రతికూలంగా గాక అనుకూలంగా మనకు కరావలంబ మిచ్చి కాపాడాలని భావం. అలా కాపాడాలంటే త్వాం వృణే. ఓ మహాశక్తీ నా కనుకూలించ మని నిన్ను నను వరిస్తున్నాను లేదా భజిస్తున్నానని ధ్యానించాలి ఈ సాధకుడు.
ఆదిత్యవర్ణే తపసో థిజాతో
వనస్పతి స్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు
మాయాం తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః
ఎలాటి ఉదాత్తమైన భావనతో ధ్యానించాలో దాన్ని కూడా వివరిస్తున్నదీ మంత్రం. ఆ బ్రహ్మ విద్యే గదా ఈ శ్రీ విద్య అని పేర్కొన్నాము. అది ఆదిత్య వర్ణాం - ఆదిత్య మండలం లాంటి దీప్తి కలిగినదా విద్య. నిత్యమూ ప్రకాశించే స్వభావం దానిది. తమస్సు కాదది జ్యోతిస్సు. తమస్సు అజ్ఞానానికైతే జ్యోతిస్సు జ్ఞానానికి ప్రతీక. అందులో కూడా జడజ్యోతి కాదు. చైతన్య జ్యోతి. అసుదితా నస్తమిత అన్నారు భగవత్పాదులు. అంటే ఒకప్పు డుదయించేది కాదు. మరొకప్పుడస్త మించేది కాదు.
Page 24