#


Index

  మహాశక్తి గనుక దేనికైనా సమర్థురాలా దేవత. అంత సామర్థ్య ముందని ఏమిటి తార్కాణం.

పద్మే స్థితాం పద్మవర్ణాం తామి హోపహ్వయే శ్రియం.

  పద్మంలో నివసిస్తున్న దాశక్తి. పద్మం వంటి వర్ణం కలిగినది. అలాంటిది గనుకనే నన్ను తప్పకుండా అనుగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ఆ మహాశక్తిని నా మీది కావాహన చేసుకొంటున్నాను. పద్మంలో నివసించట మేమిటావిడ. పద్మ వర్ణ మేమిటావిడకు. పద్మమంటే కమలం గదా. అది సహస్రార కమలమే. అంటే వేలకొలది వృత్తులు గల మన అంతః కరణమే. ఏ ఆలోచన వచ్చినా మనసులోనే గదా వస్తున్నది. ప్రతి ఆలోచనలో తిష్ఠ వేసుకొని కూచున్నదా పరాశక్తే. ఆ శక్తి పరి స్పందమే ఈ ఆలోచన. ఏ ఆలోచన వస్తుంటే దాని ఆకారమే ధరిస్తుంటుందా శక్తి. అదే దాని వర్ణం.

  అయితే మనసులో కలిగే ప్రతి ఆలోచననూ ఆహ్వానించ గూడదు మానవుడు. ధియో యోనః ప్రచోదయాత్తని త్రోసి పారేయాలి ఎప్పటికప్పుడు. మరి అన్ని వృత్తులూ త్రోసివేస్తే ఏ వృత్తిని ఆవాహన చేయాలి. ఏది మోక్ష మార్గానికి తోడు పడుతుందో అలాటి సవితుర్వరేణ్యం భర్గః - బ్రహ్మాకార వృత్తిని మాత్రమే. ఎలా ఉంటుందది.

Page 22