వాటి కతీతుడైన ఈశ్వరుడనని గదా. ఈశ్వర చైతన్యమే సుమా నీవని నాకు చెప్పేదేది. కాం తదాకార వృత్తి. అదే తాం. దానిని అని అర్థం. తదాకార వృత్తిని. ఆ బ్రహ్మ విద్యా రూపిణే శ్రీదేవి. అలాటి దేవతను భావిస్తూ పోతే తద్భావ భావనా బలంతో తనకా పరమాత్మ స్వరూప ప్రాప్తే కలుగుతుందని సాధకుడి ఆశ.
అది కేవలం మన ఆశేనా నిజంగానే బ్రహ్మ పదాన్ని అందిస్తుందా ఆ దేవత అంటే గారంటీ ఇస్తున్నది మంత్రం. ఏమని. హిరణ్య ప్రాకారాం. దేవత అంటే ఏమనుకొంటున్నారు. బ్రహ్మాకార వృత్తి అది. బ్రహ్మ మెలా ఉంది. హిరణ్య నిధి లాంటిది. అమూల్యమైనది. ప్రజ్ఞాన ఘనం. అలాటి ధన మెవరికంటే వారికి లభించకుండా దానికి ప్రాకారమయి కూచున్నదీ విద్య. ప్రాకారం కప్పినట్టు కప్పేసింది దాన్ని. కప్పి కాపాడుతున్నది. ఆర్ధాం జ్వలంతీం ఉత్తమాధికారులైన సాధకుల పాలిటి కది ఆర్థ. సౌమ్యమైనది. ప్రసన్నమైనది. అనుగ్రహిస్తుంది వారిని. అదే అనధికారులైతే జ్వలంతి. బ్రహ్మాండంగా మండిపోతూ దగ్గరికి రానివ్వదు. నిగ్రహిస్తుంది. వారికా విద్య ప్రాప్తించదు.
కనుక అలాటి బ్రహ్మ విద్యను పొందాలంటే సాధికారుల మనిపించు కోవాలి మనం. తృప్తాం తర్పయంతీం - అప్పుడది తృప్త అయి మనకు తృప్తి నిస్తుంది. నిత్య తృప్త అమ్మ వారు. కనుక ఆ విద్యారూపిణి అయిన మాత నాశ్రయించిన ప్రతి ఒక్క జిజ్ఞాసువునూ బ్రహ్మ జ్ఞాన మందించి తృప్తి పరుస్తుంది.
Page 21