#


Index

  ఈ అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే నాద ప్రబోధి`నీం ప్రజ్వలింప జేస్తున్న దెవరు. ఎవరున్నారు ఇక. ఆ మాయా శక్తే. అది హరిణి అయితే మనలను సంసారాభి ముఖంగా హరిస్తుంది.

  అలా కాకుండా సాయుజ్యం వైపు తీసుకెళ్లాలి మనలను. తీసుకెళ్లాలంటే హ్రీ కాకుండా శ్రీ కావాలని చెప్పాము. అలాటి శ్రీదేవినే ఉపహ్వయే. మనసులోకి ఆవాహన చేయాలి ప్రతి మానవుడనే క్షత్రియుడు. అది మనకు బ్రహ్మాకార వృత్తిగా మారి శ్రీర్మాదేవీ జుషతాం. నాలో ప్రవేశించి నన్నా పరమాత్మ స్వరూపాన్నే ఆశ్రయించి దానితో ఏకమయ్యేలాగా అనుగ్రహించాలని ప్రార్ధన. ఇదే ఇందులో గుప్తంగా ఉన్న అంతరార్ధం. ఇదే వివక్షితం కూడా ఈ శ్రీ సూక్తాని కంతటికీ. ఎందుకని.

కాం సోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ధాం
జ్వలంతీం తృప్తాం తర్పయంతీం -
పద్మే స్థితాం పద్మ వర్ణా మిహోపహ్వయే శ్రియమ్

   కాం - నీవు ప్రార్థిస్తున్నది ఎలాటి శ్రీదేవినో తెలుసా. సోస్మితాం -సః అస్మి అనే రెండు మాటలూ కలిసి సోస్మి అయింది. సోస్మి అంటే అదే నేనని అర్ధం. సోహ మస్మి అన్నా సోస్మి అన్నా ఒకటే. అదేనేనంటే ఎవరా అది. పరమాత్మ చైతన్యం. అదేనేనంటే అప్పటికేమని అర్థం నేను శరీర మనః ప్రాణాల మేరకే పడిపోయిన జీవుడను కాను.

Page 20