ఇవన్నీ ఏమిటి. చతురంగ బలం. చతురంగమంటే నాలుగు విధములైన బలం. అదే రధ గజ తురగ పదాతులని పేర్కొంటారు. ఇవన్నీ కావలసిన వారెవరు. దేశమేలే క్షత్రియులు. క్షతం నుంచి కాపాడవలసిన వారు. వారు అలా కాపాడాలంటే విదేశీయుల దాడికి జవాబు చెప్పగల మందీ మార్బల ముండాలి వారికి. అదే ఈ అశ్వ రధాది చతురంగ బలం. అశ్వపూర్వాం - గుఱ్ఱాలు ముందుంటే. రధ మధ్యాం. రధాలు మధ్యలో ఉంటే. హస్తి నాద. ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తుంటే. ఇలాటి బలాన్ని ప్రబోధినీం తమకు వర్ధిల్ల జేయాలని కోరుకోవాలి మహారాజులు. ఎవరిని. ఆ మహాశక్తిని.
ఎలాగని. శ్రియం దేవీ ముపహ్వయే. ఆ శ్రీదేవిని ఉప నాసమీ పానికి హ్వయే ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానిస్తే నన్ను కటాక్షించి శ్రీ ర్మాదేవీ జుషతాం. ఆ శ్రీదేవి నన్ను సంక్రమించు గాక అని అమ్మవారిని చిత్తశుద్ధితో ప్రార్ధించాలి క్షత్రియుడు. అప్పుడతని చిత్తశుద్ధి శ్రద్ధా భక్తులను గమనించి ఆ శక్తి తప్పకుండా కటాక్షిస్తుంది. అతని సంకల్పానికి తగినట్టుగా కోరిన అశ్వాది బలాన్ని ప్రసాదిస్తుంది. తన్మూలంగా శాత్రవులతో అతడు పోరాడితే వరలక్ష్మే గాక అతనికి జయలక్ష్మి కూడా కాగలదు.
ఇది బాహ్యార్థమైతే అంతరార్థం వేరే ఉన్నది. ఇది ఐహికమైతే అది ఆముష్మికమైన మోక్షానికి పనికి వచ్చేది. ఒక విధంగా మనమూ
Page 18