#


Index

  ఆ మాటకు వస్తే మనమూ క్షత్రియులమే ఒక విధంగా. క్షతమంటే అనారోగ్యం కావచ్చు. దారిద్య్రం కావచ్చు. మలినమైన ఆలోచనలు కావచ్చు. అవన్నీ తొలగిపోవాలంటే దానికి తగిన జ్ఞానం కావాలి. అది గోవు. దానికి వ్యాప్తి కావాలి. అది అశ్వ. దానివల్ల పరిపూర్ణుల మనిపించుకోవాలి. అది పురుష. ఐహికంగా ఇవి వరలక్ష్మి ప్రసాదిస్తే ఆధ్యాత్మికంగా మోక్షలక్ష్మి అనుగ్రహించాలి. అది కూడా ఎప్పుడూ అపగామిని గాక అనపగామిని అయి మన దగ్గరే నిలిచి ఉండాలని కోరుకోవాలి. కోరుకొంటే లభిస్తాయా. లభిస్తాయి. ఏదైనా మానవుడి భావనను బట్టి ఉంటుంది. భావన బలంగా ఉంటే అన్నీ సిద్ధిస్తాయి. తం తమే వైతి కౌంతేయ - సదా తద్భావ భావితః అని గీతావాక్యం. తద్భావ భావన అని ఒకటుంది. ఏది మనం దీర్ఘకాలం నిరంతరమూ తదేక భావంతో ధ్యానిస్తామో అది మనకు తప్పకుండా ఫలిస్తుందని శాస్త్రం హామీ ఇస్తున్నది. అది ఐహికమా ఆముష్మికమా అడగకండి. దేనికైనా సూత్రమొకటే. అది నిరంతర భావన. అదే చెబుతున్నదీ మంత్రం.

అశ్వపూర్వాం రథమధ్యాం - హస్తినాద ప్రబోధినీం
శ్రియం దేవీ ముపహ్వయే - శ్రీర్మాదేవీ జుషతామ్

బాహ్యార్ధం చెబితే అశ్వ - గుఱ్ఱాలూ - రధ రధాలూ - హస్తి ఏనుగులూ. వీటితో పాటు పురుష - పదాతి వర్గమూ ఉండవలసిందే

Page 17