సాధకుడి మననం వల్ల పుష్ప మిప్పటికి ఫలించింది. మంత్రమే పుష్పమని చెప్పాము. అది దేవుడికి సమర్పించే పుష్పమను కొంటున్నారేమో. బాహ్యమైన క్రియ అది. కాని దాని ఆంతర్య మాలోచిస్తే ఇంత దూరముంది దాని భావం. పురుష సూక్తం అధోముఖంగా సృష్టిని వర్ణించి చివర కూర్ధ్వముఖంగా దాన్ని లయం చేసుకొనే మార్గం సంగ్రహంగా సూచన చేసింది. పోతే మంత్ర పుష్పం లయమనేది ఎందులో చేసుకోవాలో సాధకుడా పురుష తత్త్వాన్ని ముందు పేర్కొని మనమున్న ఈ అధో భూమిక నుంచి ఆ ఊర్ధ్వ ముఖంగా మనమెలా ప్రయాణం చేయాలో దాన్ని మనకు విపులంగా వర్ణించి చూపుతున్నది. మొత్తానికి రెండూ కలిసి మనకున్న జీవిత సమస్య ఏదో అది మనకెందు వల్ల సంక్రమించిందో దాన్ని మరలా పరిష్కరించుకొనే మార్గమేదో నిరూపించి మన జీవితానికి నిః శ్రేయస ఫలాన్ని ప్రసాదిస్తున్నాయి.
ఓమ్
తత్స ద్య్రహ్మార్పణ మస్తు
Page 172