త్వం ప్రజాపతిః నీవే ఈ చరా చర సృష్టికీ స్రష్టవు - అని ఈ భావంతో పట్టుకో ఆ తత్త్వాన్ని. ఇందులో త్యమ్మనేది నిరుపాధికాన్ని చెబితే యజ్ఞాదులన్నీ దాని సోపాధికమైన విభూతిని చెబుతున్నాయి. విభూతి అన్నప్పుడది చేతన జగత్తే కాదు. అచేతన జగత్తు కూడా. అందుకే చెబుతున్నాడు మరలా. త్వం త దాపః నీవే ఆకాశాది పంచభూతాలు. జ్యోతీరసోమృతం. పాంచ భౌతికమైన శరీరం కూడా నీవే. అందులో ఉన్న జ్యోతి మనస్సు రసః బుద్ధి - అమృతం - దాన్ని నడిపే సమష్టి బుద్ధి హిరణ్య గర్భతత్త్వమూ అంతా నీవే. బ్రహ్మ భూర్భువ స్సువరోమ్. నీవే నిర్గుణంగా బ్రహ్మం. సగుణంగా తేజోబన్నాత్మకమైన ఈ చరా చర సృష్టి కూడా. అని ఇలా భావించాలా తత్త్వాన్ని భావిస్తే స్వరూప విభూతులు రెండూ కలిసి ఏకైకమైన తత్త్వంగా అనుభవానికి వస్తుంది.
ఈశాన స్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వ భూతానాం - బ్రహ్మాధిపతి గ్రృహ్మణోధిపతి - త్ప్రహ్మా శివోమేస్తు సదాశివోమ్
వస్తుందా అని సందేహించ నక్కర లేదు. నిర్గుణంగా అది పరమాత్మ అయితే సగుణంగా అదే ఈశానుడూ ఈశ్వరుడూ. ఐశ్వర్యమంతా ఆయన సొమ్మే. ఐశ్వర్యమంటే ఈశ్వర భావం. నామరూప ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు.
Page 170