#


Index

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు - త్త్వం యజ్ఞస్వం నషట్కార స్త్వమింద్రస్వగ్ం రుద్ర - స్వం విష్ణుస్వం బ్రహ్మా త్వం ప్రజాపతిః -

  ఎక్కడ ఉన్నాడా పరమాత్మ. ఎలా పట్టుకోవాలా తత్త్వాన్ని ఎక్కడేమిటి. సర్వత్రా ఉన్నాడు. సమస్త భూతాల లోపల సంచరిస్తున్న దాయనే. ఏదీ ఎక్కడా కనపడలేదే. గుహాయాం బుద్ధి గుహలోనే అభివ్యక్తమయి ఉన్నాడు. ఆలోచనా రూపంగా ఉన్నదదే. సుఖదుఃఖా ద్యనుభవ రూపంగా ఉన్నదీ అదే. కర్తా భోక్తా అనుకొంటున్న జీవుడెవరను కొంటున్నా వీ జీవాత్మ రూపంలో ఉన్నదా పరమాత్మే. విశ్వమూర్తిషు. అంతేగాదు. ఈ విశాల విశ్వంలో నీకు కనిపిస్తున్న రూపాలన్నింటిలో అంతర్గతంగా ఉన్నదా పరమాత్మే. ఆయనే ఈ సమస్త రూపాలూ. ఆయనే ఈ రూపాలుగా భాసిస్తున్నదీ.

  అలాంటి సర్వవ్యాపకమైన తత్త్వం కనుకనే నీవేది చూచినా ఏది భావించినా అదేనని తెలుసుకో. త్వం యజ్ఞః నీవే యజ్ఞ క్రియ త్వం వషట్కారః నీవే వషట్టనే శబ్ద ముచ్చరిస్తూ చేసే ఆహుతి. త్వమింద్రః నీవే హవిస్సు గ్రహించే ఇంద్రుడవు. త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మా. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులూ.

Page 169