రాజాధి రాజాయ ప్రసహ్య సాహినే - నమో వయం వైశ్రవణాయ కుర్మహే - సమే కామాన్ కామకామాయ మహ్యం - కామేశ్వరో వైశ్రవణో దదాతు
ఈ మంత్రానికి మామూలుగా అర్థం చెబితే ఇలా చెప్పవచ్చు. రాజాధి రాజంటే కుబేరుడనే దిక్పాలకుడు. రాజరాజని పేరుంది కుబేరుడికి. అంతేకాక వైశ్రవణుడన్నా కుబేరుడే. విశ్రవసుడనే మహర్షి కుమారుడు గనుక ఆపేరు వచ్చింది. విశ్రవసుడనే వాడి కిద్దరు భార్యలైతే అందులో మొదటి భార్యకు పుట్టినవాడు కుబేరుడు. రెండవ భార్య అయిన కైకసికి జన్మించారు మరి ముగ్గురు. వారే రావణ కుంభకర్ణ విభీషణులు. ఒక కూతురు కూడా జన్మించింది. అది శూర్పణఖ. అంచేత రావణుడెవరో గాదు. కుబేరుని తమ్ముడే. లంకా నగరం మొదట కుబేరుడిదే. పుష్పక విమానం కూడా అతనిదే. బలవంతంగా అతని నుంచి అపహరించి తనకు స్వాధీనం చేసుకొన్నాడు రావణుడు. కుబేరుడు నవనిధుల కధిపతి. ధనపతి అని పేర తనికి. రావణుడు రాక్షసాధిపతి అయితే కుబేరుడు యక్షుల కధిపతి. అతినికి లంక రాజధాని అయితే ఇతనికి రాజధాని అలకా పట్టణం. శివుడతని కారాధ్య దైవతమైతే ఇతనికి సాక్షాత్తూ మిత్రుడే. ఇదీ పౌరాణికంగా చెబితే కుబేరుడి వ్యవహారం.
Page 165