ఒక్క మానవ శరీరంలోనే అందులో కూడా మాంస రూపమైన హృదయంలో కూడా కాదు. దాని నుంచి పైకి సాగి పోయే నాడీ రక్తంలోనూ కాదు. తద్వారా స్పందించే బుద్ధి వృత్తులలో ఉందా సాధనం. ఈ సాధనం ద్వారా బుద్ధి వృత్తి రూపంగా స్పందిస్తే అది అద్దం లాగా ప్రాపంచికమైన పదార్ధాల బొమ్మలను ప్రతిబింబించి చూపుతుంది. 99 వృత్తులలా చూపుతుంటే వాటిలోనే వరేణ్యం భర్గః అన్నట్టు ఒకానొక వృత్తి బ్రహ్మాకారంగా మారి తనలో ఆ బ్రహ్మ స్వరూపాన్నే ప్రకటం చేసి చూపగలదు. ఒక దీప ప్రకాశమెలాగా అక్కడే చీకట్లో గుప్తమైన వస్తువును ప్రకటం చేసి చూపుతుందో అలా చూపుతుందీ వృత్తి. బ్రహ్మతత్త్వాని కుపలబ్ది స్థానమీ మానవుడి బుద్ధే. అందువల్లనే మానవుడి బుద్ధి గుహలోనే వచ్చి ప్రవేశించాడా పరమాత్మ అని శాస్త్రం ఘోషించటం. క్రొత్తగా ప్రవేశించటం దేనికీ అంతటా ఉన్నప్పుడు. అయినా ఆ మాట అన్నదంటే ప్రవేశించిందని చెప్పటం కాదు దాని ఉద్దేశం. అక్కడే ప్రకటమై కనిపిస్తుందని. ఇంతకూ ఉన్నదే అభివ్యక్త మవుతున్నది గాని లేనిది సృష్టి కావటం లేదు. అభివ్యక్తి సాధనమే మానవుడి బుద్ధి. అది స్వతహాగా జడమైనా చైతన్యాన్ని పట్టుకోగలదు. కారణం. అజ్ఞాతంగా అదే దీనిలో చేరి దీన్ని గట్టిగా పట్టుకొని ఉంది. ఇదీ ఇక్కడ మనం గ్రహించవలసిన రహస్యం.
Page 161