ఆ వృత్తులలో ఒకానొక వృత్తి బ్రహ్మాకార వృత్తిగా మారి సర్వవ్యాపకమైన బ్రహ్మ స్వరూపాన్ని దర్శించి పరిపూర్ణమైన బ్రహ్మానుభవ మీ జీవుడికి లభిస్తున్నది. కనుకనే ఇప్పుడర్ధ మవుతుంది మనకు హృదయమూ బుద్ధీ రెండింటినీ ఏకం చేసి మన ప్రాచీను లెందుకు వర్ణిస్తూ వచ్చారో.
మంచిదే. కాని ఇప్పుడు మీరు చెప్పే మాటలను బట్టి చూస్తే ఒక
సందేహ మేర్పడుతున్నది వినేవాళ్ళకు. శరీరం జడమన్నారు. అందులో
ఉన్న హృదయమూ జడమే. దానిలో ప్రవహించే రక్తమూ జడమే.
శిరస్సుకు వెళ్లే సుషుమ్నా నాడీ జడమే. అది అందించే రక్తమూ జడమే.
తద్ద్వారా ఏర్పడే బుద్ధి వృత్తీ జడమే గదా. ఈ జడ పరంపర మనకు
శుద్ధ చైతన్య రూపమైన బ్రహ్మానుభవమెలా ఇవ్వగలదు. చెబుతున్నాము
వినండి. అసతో మా సద్గుమయ అన్నట్టు అసద్రూపమైన బుద్ధి వృత్తే
చిద్రూపమైన చైతన్యాన్ని అందిస్తుంది మనకు. ఎలాగంటే చైతన్యం
సర్వ వ్యాపకం. అది లేని చోటు లేదు. అది శరీరం వెలపలే గాక
శరీరం లోపల బుద్ధి వృత్తి దాకా నిండి నిబిడీ కృతమయి ఉంది. కాని
చాలా గుప్తంగా ఉంది. ఈ మొత్తంలో సద్రూపంగానే గాని చిద్రూపంగా
ప్రకటం కావటం లేదని చెప్పాము. ఉండటమేమో ఉంది గాని ప్రకటం
కాలేదు. ప్రకటం చేస్తే మాత్రమవుతుంది వెంటనే. అలా ప్రకటం చేసే
సాధనం బాహ్యంగా ఎక్కడా లేదు. శరీరాలలో కూడా స్థావరాలలో
లేదు. జంగమాలలో కూడా పశుపక్ష్యాదులలో లేదు.
Page 160