#


Index

  అదే మనకు క్రమంగా బోధిస్తున్నదా రహస్యమీ మంత్ర పుష్పం. ఆలకించండి.

తస్యమధ్యే మహా నగ్ని ర్విశ్వార్చిర్విశ్వతోముఖః - సోగ్రభుగ్విభజన్ తిష్ఠ న్నాహార మజరః కవిః - సంతాపయతి స్వం దేహ - మాపాదతల మస్తగః -

  అది వట్టి ఖాళీ గాదట. మరేమిటి. ఆ ఖాళీలో ఒక గొప్ప అగ్ని హోత్రముంది. అగ్ని అంటే ఉష్ణ గుణం. తేజస్సు విశ్వార్చిః - దానికన్నీ మంటలే - విశ్వతో ముఖః అన్నివైపులా ప్రసరిస్తుంటాయి దాని మంటలు. ఏమిటర్ధం. హృదయంలో ఉండే రక్తమే పెద్ద అగ్నిహోత్రం. దాని నుంచి బయటికి వచ్చే రక్తనాళా లన్నిటిలో రక్తమే ప్రవహిస్తుంటుంది. రక్తంలో ఉండేదంతా ఉష్ణగుణమే. అది రక్తంతో పాటు సర్వత్రా ప్రసరించక పోతే ఎక్కడి కక్కడ శరీర భాగాలు చల్లబడి చచ్చుబడి పోతాయి. కాబట్టి శరీరమంతా హృదయాగ్నే వ్యాపించి ఉంది. అగ్ని అనేసరికది ఒకటి గాదు. అంటే అర్థమొక విధంగా పనిచేయదు. అందులో మూడు శాఖలున్నాయి. వాటినే బాహ్యంగా చెబితే త్రే తాగ్నులంటారు. ఒకటి ఆహవనీయం రెండు దక్షిణాగ్ని మూడవది గార్హ పత్యం.

  ఆధ్మాత్మికంగా భావిస్తే ఆహవ నీయ మనేది మన ముఖంలో ఉండే ఉష్ణ గుణం. మనం తినే పదార్ధాలన్నీ అక్కడే ఆహుతి అవుతుంటాయి

Page 154