#


Index

  అవి దాని చుట్టూ చేరి గట్టిగా దాన్ని పట్టుకొని ఉన్నాయి. తాళ్లతో బిగించినట్టు బిగించాయి. అలాంటప్పుడిక కదిలే ప్రశ్నేముంది. స్థానం తప్పే ప్రసక్తి ఏముంది. అసలీ శరీరమంతా ఇలా నిలిచి ఉందంటే ఇందులో ఏ భాగ మెక్కడికక్కడ స్థిరంగా ఉందంటే అది దాన్ని సమంగా వ్యాపించిన ఒకానొక శక్తి మీద ఆధారపడి ఉండటం మూలాన. దానికే ధారణ అని పేరు. ధారణా రూపమైన ప్రాణశక్తి దీన్ని ఇలా ధరించి ఉంది. అంచేత దేని స్థితికి గానీ దాని స్థితి తప్పే ప్రశ్నే రాదు.

  పోతే ఇలా తన స్థానంలో తానుండి పనిచేస్తున్న ఈ హృదయానికి నాలుగు ద్వారాలున్నాయి. అది ఒక ద్వారకా పట్టణం. తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం - తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్- దాని నడిబొడ్డున ఒక సుషిరముంది. సుషిరమంటే రంధ్రం. ఖాళీ ప్రదేశం. అదే హృదయాకాశం. దహరాకాశ మని కూడా పేర్కొంటారు. యావానయం బహిర్థా తావా నయమంతర్థో ఆకాశః - బాహ్యంగా ఈ ఆకాశమెంత విస్తరించి కనిపిస్తున్నదో అంతగా విస్తరించి ఉన్నదీ దహరాకాశం. దహరం దభ్ర మంటే అసలు చాలా చిన్నదని అర్ధం. చిన్నదిగా హృదయం మేరకు సంకుచిత మయినట్టు కనిపిస్తున్నా ఇది వాస్తవంలో చిన్నది గాదు. చాలా పెద్దది. బాహ్యమైన ఆకాశమెంతో అంతా ఉన్నది. అయినా ఆకాశమనేది నిరాకారం నిశ్చలం గదా. దానికి చిన్నా పెద్దా అనే భేదమే ముంటుంది. మరి దహర మని ఎందుకన్నారు. హృదయమనే ఉపాధిని

Page 152