దాని నుంచి నలువైపులా దాని కిరణాలు ప్రసరించి నట్టు హృదయ మండలం నుంచి కూడా శతాధికనాడులు కిరణాలలాగానే శరీర మంతటా వ్యాపిస్తున్నాయి. అవి అగ్ని జ్వాలలాగా మాలాకారంగా దాన్ని చుట్టు ముట్టి మండుతుంటాయి. మంటలలాగా రక్తంతో నిండి ఎఱ్ఱగా కనిపిస్తుంటాయి అంతకూ బ్రహ్మాండ శరీరానికి సూర్యమండల మొక ఆయతన మైతే పిండ శరీరానికి హృదయాగ్ని మండల మొక ఆయతనం. అది అరుణారుణంగా కనిపిస్తే ఇదీ అరుణ వర్ణమే. దాని కిరణాలు సర్వవ్యాపకమై సర్వ ప్రపంచాన్నీ వెలిగించినట్టే దీని నాడీ కిరణాలు కూడా శరీరమంతా వ్యాపించి ప్రకాశింప జేస్తుంటాయి. రెండూ కలిసి నన్నడిగితే చిదగ్ని కుండమే. అగ్నికుండం పైకి జడంగా కనిపిస్తున్నా లోపల అంతర్యామి రూపంగా చైతన్యముండి నడుపుతున్నట్టే ఇక్కడ హృదయ కుండాన్నీ అక్కడ బాహ్యంగా సూర్యకుండాన్నీ అఖండ చైతన్యమే సమష్టి వ్యష్టి రూపంగా మారి నడుపుతున్న దనుకొంటే సరిపోతుంది. అయితే ఈ హృదయాన్ని పద్మకోశం లాంటిదని వర్ణించారు బాగానే ఉంది. లంబ త్యాకోశ సన్నిభం - అంతే గాక అది ఆకోశం లాగానే లంబతి అధోముఖంగా వ్రేలాడుతున్నదని కూడా అంటున్నారు. అలా వ్రేలాడుతూ ఉంటే జారిపడి పోదా. పోదు. ఎందుకంటే సంతతగం సిరాభిస్తు - సిరలంటే రక్తనాళాలు. అవి మన శరీంరలో 72 వేలున్నాయంటారు యోగశాస్త్ర వేత్తలు. పోతే అందులో నూట ఒక్క నాడులు హృదయానికి సంబంధించినవి ముఖ్యమైనవి.
Page 151