అలాటి అఖండాకార వృత్తిని మమ ఆ వహ 링 మనసులో ప్రవేశ పెట్టు. ఎవడా పెట్టవలసిన వాడు. జాతవేదః మనం రగులు కొల్పిన అగ్ని హోత్రమా. లేక దాని నధిష్ఠించిన అగ్ని అనే దేవతా. అది భూతం. ఇది శక్తి. భూతం దాని పాటికది అచేతనం. దేవత చేతనమైనా పరిచ్ఛిన్నమైన శక్తి విశేషం. కనుక వాటి ద్వారా మన మనసుకా స్ఫూర్తి నివ్వవలసినదా పరిపూర్ణ చేతనుడైన పరమేశ్వరుడే. ఆయనే జాతవేదుడు. భోగమైనా మోక్షమైనా ఆయనే ఇవ్వాలి మనకు.
తాం మ ఆవహ జాతవేదో - లక్ష్మీమనప గామినీమ్ -
యస్యాం హిరణ్యం విందేయం - గా మశ్వం పురుషా నహమ్ -
తాం మే ఆవహ లక్ష్మీం. కాబట్టి అలాటి లక్ష్మినే అఖండాకార వృత్తినే నాకు ప్రసాదించు ఓ అగ్నిహోత్రా - ఎలాటి లక్ష్మి కావాలో తెలుసా. అనపగామినీం అపగామిని కాగూడదది. పక్కకు లాగేదేదో అది అపగామిని. తొలగిపోయేది. ప్రాపంచిక భోగాల వైపు లాగగూడదది. అలా జరిగితే మోక్ష మార్గానికి తొలగి పోతాను నేను. అయితే ఒక మోక్షాన్ని కోరితే సరిపోతుందా. అంతవరకూ జీవిత మనేది కొనసాగాలి గదా. దానికి కావలసిన అన్నపాన ధన కనక వస్తు వాహనాదులక్కర లేదా. ఉంది వాటి అవసరం కూడా. కాని అదే పనిగా వాటి వెంట పరుగెత్త నక్కర లేదు. యస్యాం హిరణ్యం విందేయం.
Page 15