#


Index

  అలా అనుకోకపోతే నరుడు కాదు వీడు నారాయణుడేనని చెప్పాము. అంతవరకూ తాత్కాలికంగా ఒక జీవుడున్నాడని ఒప్పుకోవలసి వస్తున్నది. అలా ఎప్పుడొప్పుకొన్నామో అప్పుడీ జీవుడికీ సంసార బాధలు తప్పవు. సంసారమే ఒక సముద్రం. సముద్రే అంతం. ఈ సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉన్నంత వరకూ దీని అంతమైన ఆ నారాయణ స్వరూపం మనకంతు పట్టదు. పట్టనంత వరకూ విశ్వ శంభువం విశ్వానికంతా శం అంటే సుఖశాంతులు లభించే ప్రసక్తి లేదు. విశ్వమంటే ఇక్కడ విశ్వుడైన జీవుడనీ అర్థమే. విశ్వమైన ప్రపంచమనీ అర్థమే. ప్రపంచానికీ లేదు శాంతి జీవుడికీ లేడు.







Page 145