స్ఫురిస్తున్న దంటావు. అంతేనా.
అంతకన్నా ఏమైనా ఉందా. ఈ ఉండటమనే స్ఫురణ లేదా స్ఫురిస్తూ
ఉండటమనే లక్షణం లేని పదార్ధమేదైనా ఉందేమో నీవే చెప్పు. ఇదుగో
ఈ సదాత్మకమైన స్ఫూర్తికే నారాయణుడని నామాంతరం. ఇలా అర్ధం
చేసుకొంటే చాలు. ఇక నారాయణ స్వరూపానికి భిన్నంగా ఇహ
పరాలలో ఏ ఒక్క భావమూ లేదని నీకిట్టే తెలిసి పోతుంది. లేకుంటే
మరి ఈ పదార్ధాలు కనిపిస్తున్నాయే అవి ఎలా కనిపిస్తున్నాయంటారు.
ఆ కనిపించటమవి గావు. ఆ సచ్చిదాత్మకమైన నారాయణ తత్త్వమే
ఇలా ఇన్ని రూపాలుగా దర్శనమిస్తున్నది. అది దాని స్వరూపమైతే
Substance ఇదంతా దాని విభూతి
Expansion formation. ໙໖
రూపంలో కనిపిస్తున్నది గనుక అప్పటికంతా అదే. ఇక జీవ
జగత్తులంటూ దానికి వేరుగా లేవు. లేకుంటే ఒక జీవుడనీ శరీరమనీ
ఇందులో మనం బందీ అయ్యామనీ మనకు జనన మరణాలు తప్ప
వనీ ఇలాటి ప్రసక్తే లేదు. అంతా అబద్దమయి పోతుంది.
వస్తుసిద్ధంగా ఏదీ దానికన్యంగా లేకపోయినా ఉన్నట్టు మన అనుభవానికి వస్తున్నాయీ భావాలన్నీ. ఇది మనం భావిస్తే వస్తున్నాయే గాని లేకుంటే ఏదీ లేదు. అంతా హుళక్కే. మనం భావించక పోయినా వాటి పాటికవి ఉండవచ్చు గదా లేవని ఎలా చెప్పగలమని ప్రశ్న వస్తుంది. దానికి జవాబేమిచ్చారంటే ఏదైనా ఒకటి ఉందన్నావంటే ఆ ఉనికి జడం.
Page 141