#


Index

  జీవ జగదీశ్వరు లిప్పుడున్నట్టే కనిపిస్తారు కాని ఎప్పుడూ నిలిచి ఉండరు. కారణమవి విశేష రూపాలు. విశేషాలన్నీ ఎప్పటికప్పుడు మారి పోతుంటాయి. అదే సామాన్య స్వరూపమైతే మారే ప్రసక్తి లేదు. ఇవి అపరమైతే అది పరమందుకే అయింది. పరతత్త్వమది. దాన్నే మనం నారాయణ తత్త్వ మంటున్నాము.

  నారాయణ పరోధ్యాతా - ధ్యానం నారాయణః పరః - ఇంతెందుకు. అది సామాన్యమూ సర్వ వ్యాపకమూ ఎప్పుడయిందో అందులో మరలా ధ్యాతా ధ్యానం ధ్యేయ మనే త్రిపుటి కవకాశం లేదు. ధ్యాత అయినా అదే. ధ్యేయమైనా అదే. ధ్యానమైనా అదే. మూడూ నారాయణ స్వరూపమే. అంటే ఏమన్న మాట. అదే ధ్యాత అయి తననే తాను ధ్యేయంగా భావించి తానే తన్ను ధ్యానిస్తున్న దన్న మాట. ఏమిటీ మాట. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని. చెబుతా వినండి. ధ్యాతృ ధ్యాన ధ్యేయాలనేవి లేవసలు వాస్తవానికి. వస్తుతః ఉన్నదొక అఖండ చైతన్య స్వరూపమైన నారాయణ తత్త్వమే. అదే నేను ధ్యానం చేస్తున్నానుకొంటే ధ్యాత. ఫలాని దాన్ని ధ్యానిస్తున్నానని భావిస్తే అది ధ్యేయం. ఈ పని చేస్తూ దానినందు కొంటున్నానని భావిస్తే అది ధ్యానం. అంతా అబద్ధమే. ఎందుకని. అంతా ఒకే చైతన్య మన్నప్పుడిక ఈ ఫలానా అనే మూడు భావాలెక్కడివి. లేపు వాస్తవంలో. లేకున్నా ఉన్నట్టు కనిపిస్తున్నాయంటే అదే ఆభాస. వస్తువే అనేక రూపాలలో కనిపించటమే ఆ భాస అంటే.

Page 138