ఆ తరువాత మన ప్రయాణం పూర్తి అయ్యేసరి కదే జ్ఞేయంగా గాక జ్ఞానంగానే మనకు సాక్షాత్కరిస్తుంది. ఇదీ ఇందులో ఉన్న సూక్ష్మం.
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః - నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః - నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః -
ఈ భావాన్నే ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు వినండి. ఉన్నదంతా ఒకే ఒక పదార్థం. జీవుడు లేడు. జగత్తు లేదు. ఆ మాటకు వస్తే ఈశ్వరుడూ లేడు. అవన్నీ పరస్పర సాపేక్షమైన భావాలు. జగత్తుంటే జీవుడు. జీవుడుంటే ఈశ్వరుడు. జగత్తే లేదో - మొదటికే మోసం. అప్పుడీ జీవుడూ లేడా ఈశ్వరుడూ లేడు. అయితే జగత్తు లేదని ఎలా చెప్పగలవు. నారాయణ పరోజ్యోతిః - నారాయణ తత్త్వ మొక్కటే పరమమైన జ్యోతి. ప్రకాశం. పరిపూర్ణమైన చైతన్యమది. చైతన్యం గనుక స్వతః ప్రకాశం. జగత్తు స్వయం ప్రకాశం కాదు. తానున్నట్టు తనకు స్ఫురించదు. అయినా స్ఫురిస్తున్నదంటే ఆ స్ఫురణ దానిది గాదు. పరిపూర్ణమైన నారాయణుడి తాలూకు స్ఫురణ. ఆ స్ఫురణలో మనకిది కూడా స్ఫురిస్తున్నది. స్ఫురించే పదార్థమిది. స్ఫురణ కాదు. స్ఫురణ లేకుండా స్ఫురించే పదార్ధమేదైనా ఎలా స్ఫురించగలదు. అన్వయ వ్యతిరేక న్యాయాన్ని బట్టి అప్పటికి స్ఫురణే నిజానికున్న పదార్ధం.స్ఫురించేది గాదు.
Page 136