మంత్ర పుష్ప - రహస్యార్థము
మన సూక్త త్రయంలో శ్రీసూక్త పురుష సూక్తాలయినాయి. పోతే ప్రస్తుతం మూడవదైన మంత్ర పుష్పానికి వచ్చాము. పురుష సూక్తం నారాయణాను వాకం క్రిందికి వస్తే ఇదీ దాని క్రిందికే వస్తుంది. చాలావరకు దానికీ దీనికీ అంత తేడా ఉన్నట్టు కనిపించదు. అది సహస్ర శీర్షా అని ఆరంభమైతే సహస్ర శీర్షమని ఇదీ మొదలవుతుంది. అయితే పురుష సూక్తం పయి నుంచి క్రిందికైతే మంత్రపుష్పం క్రింది నుంచి పైకి చేసే ప్రయాణం. విరాడ్రూపుడైన పురుషుడు ప్రపంచంగా ఎలా పరిణమించాడో చెబుతుంది పురుష సూక్తం. అలా పరిణమించిన ఈ ప్రపంచం ద్వారా మరలా ఆ పరమ పురుషుణ్ణి ఎలా అందుకోవాలో బోధిస్తుంది ఈ మంత్ర పుష్పం. అద్వైత సిద్ధాంత రీత్యా రెండింటికీ గమ్యమొకటే చివరకు. పైకీ క్రిందికీ అనే ప్రసక్తి లేదు. సమస్తమూ ఏకమని భావించినప్పుడు.
Page 121