దైవీ స్వస్తి రస్తునః - అందుకోసమీ శరీరమనే ఉపాధి బలంగా ఉండాలి. ఇంద్రియ పటుత్వముండాలి. అలా ఉండాలంటే ఆధి దైవికమైన శక్తుల అనుగ్రహముండాలి మనకు. స్వస్తిర్మానుషేభ్యః దైవికమైనదే గాక మానుషమైన నహకారం కూడా ఉండాలి మనకు. సు అస్తి స్వస్తి Well being అని అర్థం. సుఖమైన స్తిమితమైన జీవిత మని అర్థం. అలాటి శాంతినీ సుఖాన్నీ దైవమూ మానుషమూ రెండింటి వల్లా మనకు ప్రాప్తించాలని కోరుకోవాలి. ఊర్ధ్వం జిగాతు భేషజం. అయితే అది ఎప్పుడు ఫలిస్తుంది. భేషజమంటే కల్మషం. అది మన మనస్సుల నుంచి దూరమై పోయినప్పుడు.
అందుకే శంనో అస్తు మనకే గాదు సుఖ శాంతులుండాలని ఆసించ వలసింది. మరి ఎవరికి. ద్విపదే తోడి మానవులందరికీ. అంతేకాదు. చతుష్పదే. ద్విపాత్తులైన మానవులకే గాక చతుష్పాత్తులైన జంతువులకు కూడా ఉండాలని కోరుకోవాలి సుఖశాంతులు. సర్వేసంతు నిరామయాః - ఎవరికీ ఎలాటి ఆధివ్యాధులూ కలగరాదు. లోకాస్సమస్తా స్సుఖినో భవంతు. ప్రాణులందరూ సుఖంగా జీవయాత్ర సాగించాలని పెద్ద మనస్సుతో కోరుకోవాలి ప్రతి మానవుడూ.
Page 119