అంటే వ్యాపకమైన అస్తిత్వం. జ్ఞానం సర్వత్రా ఉన్నవాడు కాబట్టి జ్ఞాని - వాడి ప్రాణం కూడా సర్వవ్యాపకం కావలసిందే తప్పదు. సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితమైన తత్త్వమది.
ఇలాటి జ్ఞానిని సంబోధించి చెబుతున్నాడు మనబోటి సాధకు డొకడు. ఏమని. ఇష్టం మనిషాణ - అముం మనిషాణ - సర్వం మనిషాణ. మనిషాణ అంటే నా మనస్సుకు ఇదంతా ప్రసాదించు నేను ధన్యుణ్ణవుతాను. ఏమిటా ప్రసాదించవలసింది. ఇష్టం. ఇహానికి సంబంధించి నేను కోరింది. అముం. అలాగే పరానికి చెందింది. అంటే పరావర జ్ఞానం నీకున్నదే నాకూ అనుగ్రహించు. అలా రెండూ అనుగ్రహిస్తే సర్వం మనిషాణ. సర్వమూ నాకు అనుగ్రహించినట్టే. ఆచార్యా ద్దైవ విదితా విద్యా సాధిష్ఠం ప్రాపతి అన్నారుగా. అంచేత నీలాటి మహనీయుడి వల్ల శ్రవణ మననాదులు చేస్తే నీ అంతే వాసినైన నాకూ నీలాటి అనుభవమే కలుగుతుందని నా నమ్మకం అని ప్రార్ధన.
పోతే ఇదంతా మనసులో పెట్టుకొని శాస్త్రానికంతా సారభూతమైన ఉపదేశం మనబోటి సాధకుల కందరికీ అందిస్తున్నదిప్పుడీ శాంతి వాక్య మనే మిషతో పురుష సూక్తం. వినండి.
Page 117