#


Index

  హ్రీ అంటే లజ్జ - లక్ష్మి అంటే సంపద అని బాహ్యార్ధం. అవి రెండూ జ్ఞానికి సత్న్యౌ భార్యలవుతాయట. లజ్జ లక్ష్మి ఇవి రెండూ అమూర్తమైన భావాలు. అవి జ్ఞానికి సత్న్యౌ భార్య లెలా కాగలవు. కాకున్నా అసలు జ్ఞానేమిటి. వాడికి భార్యలేమిటి. కనుకనే ఇది కేవలం బాహ్యార్ధంగా తీసుకోగూడదు మనం. మరేమిటంటారు. ఇంతకు ముందు లాగానే అంతరార్థం చెప్పుకోవలసి ఉంది దీనికి కూడా. ఏమిటది.

  హ్రీ అంటే హరించే శక్తి. సంసారం వైపు లాగేసే అవిద్యకే హ్రీ అని పేరు. అలాగే లక్ష్మి అంటే లక్షింప చేసేది బ్రహ్మాకార వృత్తి. విద్య అది. అప్పటికి హ్రీ లక్ష్ములంటే విద్యా విద్యలు. ఇవి రెండూ భార్యలంటే జ్ఞాని కధీనమయి ఉంటాయని భావం. వీటి రెంటి మీదా వాడాధార పడలేదు. మీదు మిక్కిలి ఇవే వాడి కధీనమయి వాడి స్వరూపంలో కలిసి ఏకమయి ఉంటాయి. విద్యా విద్యా స్వరూపిణి గదా అమ్మవారు. జ్ఞానమనేది జ్ఞానా జ్ఞానాలను రెంటినీ లయం చేసుకొన్నప్పుడే అది పరిపూర్ణ జ్ఞానం. ప్రజ్ఞానం.

  పోతే అహోరాత్రే పార్శ్వే. పగలూ రాత్రీ రెండూ జ్ఞానికి రెండు పార్శ్వాలు. రెండూ వాడికి చెందినవే ననటం వల్ల కాలమనేది వాడి విషయంలో మారకుండా ఆగిపోతుందని భావం.

Page 115