అలాంటి వాడైతే తస్య దేవా అసన్ వశే. వాడికీ చిత్త వృత్తులేమిటి ఇంద్రియ వృత్తులేమిటి. అన్నీ వశంలో ఉంటాయి. అంటే వాడి చెప్పు చేతల్లో ఉండి వాడు చెప్పినట్లు నడచుకొంటాయి. యుక్త చేష్ట స్యకర్మ సు అని గీత చెప్పినట్టు అసలు కర్మ చేయకపోడు. చేసినా వాటికి బానిస అయి చేయడు. అది ఎలా సాధ్యం. ప్రకృతి గుణాలే గదా ఏ కర్మ అయినా చేయిస్తుంది నీ చేత. ఆ గుణాలన్నీ వాడి కాత్మాకారంగా మారి కనిపిస్తాయి. కనుక అవి వాడి పట్ల గుణాలూ కావు. అవి చేయించే పనులు పనులూ గావు. గణైర్యో నవిచాల్యతే అన్నట్టు బ్రహ్మ జ్ఞాని మీద గుణాలు దాడి చేయవు. గుణమైనా అది నిర్గుణమే. ఎటు వచ్చీ జ్ఞాన దృష్టితో చూడాలి ఏ కర్మనైనా. జ్ఞాన ప్రసరణే కర్మ దాని విభూతే నని తెలుస్తుందప్పుడా జ్ఞానికి. ఇదీ ఈ వృత్తులన్నీ మనకు చేసే మహెూప దేశం. మౌనంగా చేస్తున్న మహెూపదేశం. అలాటి ఉపదేశ మందుకొని బ్రహ్మ జ్ఞానం సంపాదించి బ్రహ్మాను భావమే పొందా మనుకోండి. అప్పుడే మవుతుంది. ఆ అనుభవం ఎలా ఉంటుంది. చెబుతున్నది పురుష సూక్తం దాని ఫలశ్రుతి ఆలకించండి.
శ్రీ శ్చ తేలక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే - నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం
Page 114