కాగా ఇక్కడ వడ్రంగి ఎవడో కాదు ఈ జీవుడే. విశ్వ కర్మ అయిన పరమాత్మ మనకీ శరీరాద్యుపాధులు సరఫరా చేస్తే జీవుడనే త్వష్ట వాటి నుపయోగించుకొని అనేక ప్రయోజనాలకు వాడుకొంటున్నాడు ఈకలాపాన్ని. అది ఐహిక ప్రయోజనాలకు గాక ఆముష్మిక ఫలాన్ని ఇచ్చే యజ్ఞాది కర్మానుష్ఠానానికే వాడుకోగలిగితే ఆయా కర్మ ఫల రూపమైన స్వర్గాది రూపమే ఏతి. పొందగలడు.
తత్పురుషస్య విశ్వ మాజా సమగ్రే. కాని దానివల్ల తాత్కాలికమైన ధర్మ పురుషార్ధమే ప్రాప్తిస్తుంది గాని మోక్ష పురుషార్ధం కలగబోదు. అలాటి శాశ్వతమైన మోక్షఫలమే కావాలంటే ఇది గాదు మార్గం. మరేమిటి. ఈ విశ్వమంతా - అంటే ఈ శరీరాద్యుపాధి జాత మంతా తత్పురుషస్య - ఆ పరమపురుషుడికి సంబంధించిన విభూతేనని ఆ జాన మగ్రే. అన్నిటి కన్నా పూర్వమే ఆ జానం నేను గుర్తించానని భావించాలి. అది కర్మ గాదిప్పుడు జ్ఞానమే. అంటే ఏమిటిప్పుడు తేలిన అంశం. కేవల కర్మానుష్ఠానం స్వర్గాది సుఖాల వరకే గాని శాశ్వతమైన పరిష్కారం కాదు జీవిత సమస్యకు. సమస్యకు పరిష్కారం జన్మ పరంపర కాదు. జన్మరాహిత్యం. అది సర్వాత్మ భావ రూపమైన బ్రహ్మ జ్ఞానమే నని వ్యంగ్యంగా బోధిస్తున్నది మనకీ సూక్తం.
Page 102