సిద్ధాంతం - దృష్టాంతం - ద్రాష్టాంతికం
సిద్ధాంతం
సామాన్యం - Universal | విశేషం - Particular |
01. సామాన్యం ఏకం. | 01. విశేషాలు అనేకం |
02. సామాన్యం నుంచే విశేషాలు వస్తాయి. | 02. విశేషాల నుంచి సామాన్యం రాదు. |
03. సామాన్యం విశేషాలన్నింటినీ వ్యాపించుతుంది. | 03. ఒకదాని నొకటి గాని, సామాన్యంనుగాని విశేషాలు వ్యాపించలేవు. |
04. సామాన్యం లేకపోతే విశేషాలు లేవు. | 04. విశేషాలు లేకున్నా సామాన్యం ఉంటుంది. |
05. సామాన్యం యొక్క అస్తిత్త్వమే విశేషాల అస్తిత్త్వం. | 05. విశేషాలకు స్వతంత్రమైన అస్తిత్త్వం లేదు. |
06. అప్పటికి సామాన్యమే వాస్తవం. | 06. విశేషాలు వాస్తవంగా లేవు. |
07. సామాన్యం స్వరూపం - Substance, Reality. | 07. విశేషాలు సామాన్యం యొక్క ఆభాస - Appearance. |
08. సామాన్యం స్వరూపంగా ఉంటుంది. | 08. ఆ సామాన్యమే ఆభాసగా విశేషాల రూపంలోనూ కనిపిస్తుంటుంది. |
09. సామాన్యానికి వినాశం లేదు. అది నిత్యం. | 09. విశేషాలు ఎప్పటికైనా నశిస్తాయి. |
10. సామాన్యాన్ని దాని విశేషాలలో గుర్తించటమే ప్రత్యభిజ్ఞ. | 10. ప్రతి విశేషంలో సామాన్యంను గుర్తిస్తూ పోతే విశేషాలు సామాన్యానికి |
విజాతీయం కావు. దానికి సజాతీయమే అవుతాయి. ఇదే ప్రవిలాపనం. |
దృష్టాంతం
సువర్ణం | ఆభరణాలు |
01. సువర్ణం ఏకం. | 01. ఆభరణాలు అనేకం. |
02. సువర్ణం నుంచే ఆభరణాలు వస్తాయి. | 02. ఆభరణాలనుండి సువర్ణం రాదు. |
03. సువర్ణం ఆభరణాలన్నింటినీ వ్యాపిస్తుంది. | 03. ఒక ఆభరణం మరొక ఆభరణాన్నిగాని, సువర్ణం మొత్తాన్ని గాని వ్యాపించలేవు. |
04. సువర్ణం లేకుండా ఆభరణాలు లేవు. | 04. ఆభరణాలు లేకున్నా సువర్ణం ఉంటూనే ఉంటుంది. |
05. సువర్ణ అస్తిత్త్వమే ఆభరణాల అస్తిత్త్వం. | 05. ఆభరణాలకు స్వతంత్రమైన అస్తిత్త్వం లేదు. |
06. అప్పటికి సువర్ణమే వస్తుతః ఉన్నది. | 06. ఆభరణాలు వాస్తవంగా లేవు. |
07. సువర్ణమే ఆభరణాల స్వరూపం. | 07. ఆభరణాలు సువర్ణం యొక్క ఆభాస. |
08. సువర్ణమే సువర్ణంగా ఉంటుంది. | 08. ఆభరణాలుగా కనిపిస్తుంది. |
09. సువర్ణం నశించదు. | 09. ఆభరణాలు ఎప్పటికప్పుడు నశిస్తాయి. |
10. సువర్ణాన్ని ఆభరణాలలో గుర్తించడమే ప్రత్యభిజ్ఞ. | 10. అలా గుర్తిస్తూ పొతే ఆభరణాలు దానికి విజాతీయం కావు. సజాతీయమే. |
ఇదే ప్రవిలాపనం. |
ద్రాష్టాంతికం
ఆత్మ - అనగా ఉండటం అనే స్ఫురణ | అనాత్మ - అనగా స్ఫురించే ఆయా పదార్ధాలు |
01. స్ఫురణే ఆత్మ. అది ఒక్కటే. | 01. అందులో స్ఫురించే ప్రపంచమే అనాత్మ. అవి అనేకం. |
Ex: Friendship ఒక్కటే. | Ex: Friends అనేకం. |
02. స్ఫురణ నుంచే చరాచర పదార్ధాలు వస్తాయి. | 02. చరాచరాల నుంచి స్ఫురణ రాదు. |
03. స్ఫురణ అస్తిత్త్వమే చరాచర పదార్ధాల అసిత్త్వం. | 03. చరాచర పదార్ధాలకు స్వతంత్రమైన అస్తిత్త్వం లేదు. |
వాటినన్నింటినీ స్ఫురణ వ్యాపిస్తుంది. | |
పదార్ధాలు ఒకదానినొకటి గాని మొత్తం స్ఫురణను గాని వ్యాపించలేవు. | |
04. స్ఫురణ లేకుంటే ప్రపంచమనేది లేదు. | 04. స్ఫురించే ప్రపంచం లేకున్నా స్ఫురణ తనపాటికి తాను ఉంటుంది. |
05. స్ఫురణ అస్తిత్త్వమే వాస్తవం. | 05. ప్రపంచంకు స్వతంత్రమైన అస్తిత్త్వం లేదు. స్ఫురణ అసిత్త్వమే |
ప్రపంచం యొక్క అస్తిత్త్వం. | |
06. స్ఫురణే ఉన్నది వస్తుతః. | 06. స్ఫురించే జగత్తు వాస్తవంగా లేదు. |
07. స్ఫురణ అనేది స్వరూపం. | 07. స్ఫురించే ప్రపంచం స్ఫురణ యొక్క ఆభాస. |
08. స్ఫురణ స్వరూపంగా ఉంటుంది. | 08. ప్రపంచంగా భాసిస్తుంది. |
09. స్ఫురణ నశించదు. అది స్వతఃప్రమాణం. | 09. జగత్తు ఎప్పటికప్పుడు నశిస్తుంది ప్రమేయం గనుక. |
10. ప్రతి పదార్ధంలో స్ఫురణ యొక్క అస్తిత్త్వాన్ని | 10. అలా గుర్తిస్తూ పోతే అనాత్మ ప్రపంచం అంతా దానికి సజాతీయమే అవుతుంది |
గుర్తించటమే ప్రత్యభిజ్ఞ. | గాని అన్యం కాదు. ఇదే ప్రవిలాపనం. రెండూ కలిసి - ఆత్మ దాని విభూతి - |
ఏకం అవుతాయి. ఇదే అద్వైతులు చెప్పే సర్వాత్మభావం. |
TURNING POINTS
1. దృష్టాంతంలో బంగారమూ, ఆభరణాలూ రెండూ కనపడతాయి.
2. సామాన్య విశేషాలు రెండూ అనాత్మ పదార్ధాలే. అవి Objects. స్పష్టంగా కనబడతాయి బంగారమూ, ఆభరణాలు.
3. సామాన్య విశేషాలు రెండూ మన జ్ఞానానికి బాహ్యంగా గోచరించేవే.
4. ఇక్కడ విశేషజ్ఞానానికే సమస్య. పరిపూర్ణ జ్ఞానానికి సమస్య లేదు. విశేషదృష్టికి విశేషదృశ్యం వలన సమస్య.
5. ద్రాష్టాంతికంలో సామాన్యం కనబడదు. విశేషాలే కనబడతాయి. నామరూప ప్రపంచం కనబడుతుంది.
వాటి అస్తిత్వం కనబడదు.
6. సామాన్యం మన జ్ఞానమే. మనమే. మన ఆత్మ స్వరూపమే. విశేషాలు మాత్రం మన జ్ఞానానికి గోచరించే పదార్ధాలు.
7. నేను - Subject - నా జ్ఞానం; జ్ఞానానికి గోచరించేవి Objects.
8. కేవల జ్ఞానానికి సమస్య లేదు - కేవల జ్ఞేయానికీ సమస్య లేదు. రెండింటి గ్రంథి. అనగా విశేషజ్ఞానం విశేషదృశ్యం
కలసి ముడి పడినది. అదే దేహాత్మాభిమానం కలిగిన జేవుడు. వాడికే సమస్య.