అవి మనకు తోడ్పడుతున్నాయి మరలా ఆ మూల తత్త్వాన్ని దర్శించటానికి. ఎక్కడ ఉందది. పరోక్షంగా వరుణ గుప్తమయి పోయింది. అలాటి దాన్ని ప్రత్యక్షం చేసుకొని చూడవలసి ఉంది మనం. అప్పుడు సర్వత్రా అదేనని స్వానుభవానికి వస్తుంది. తచ్చక్షు ర్దే వహితం పురస్తా చ్ఛుక్ర ముచ్చరత్. దేవతలు మన ఇంద్రియాలు. అవి వాటి వాటి పనులు యధావిధిగా చేయాలంటే ఒక తేజస్సుండాలి. అది బాహ్యమైతే సౌర తేజస్సు. అంతరమైతే జ్ఞాన తేజస్సు. దేవ హితం. ఇంద్రియ ప్రాణ మనో బుద్ధులన్నిటికీ హితమైనదది. సమస్త వ్యాపారాలనూ నడుపుతున్నదదే. పురస్తా చ్ఛుక్ర ముచ్చరత్. పురస్తాత్ అంటే తూర్పున ప్రతి దినమూ ఉదయిస్తున్నదా శుభ్రమైన ప్రకాశమే. పురస్తాత్తంటే తూర్పునే గాక మన చక్షురాదీంద్రియాల నన్నింటినీ ముందుకు నడుపుతున్నదని కూడా అర్ధం.
ఇంత ఉపకారం చేస్తున్నది గనుకనే ఆ ప్రకాశాన్ని మనం పశ్యేమ శరదశ్శతం నూరేండ్లూ దర్శిస్తుండాలి. జీవేమ శరదశ్శతం - దర్శిస్తూనే నూరేండ్లు జీవించాలి. సమష్టి రూపాన్ని ధ్యానిస్తూ బ్రతికితే ఆ బ్రతుకు సఫలం. వ్యష్టి మేరకే బ్రతకటమైతే అది నిష్ఫలం. నందామ శర దశ్శతం మోదామ శరద శ్శతం - బ్రతికినంత కాల మానందంగా ఉండాలి. పదిమందినీ ఆనందపరచాలి. భవామ శరదశ్శతం. దృఢంగా ఉండాలి మన ఉపాధి. శృణ వామ శరద శృతం. శరీర దార్ధ్యం ఉంటేనే చెవులు పనిచేస్తాయి. ఎందుకు.
Page 99