అందుకోసం. పగలు సూర్యుడి ద్వారా అయితే రాత్రి కాల మాయనకు ప్రతినిధి అయిన అగ్ని ద్వారా. చిత్రం దేవానా ముదగా దనీకం అందుకోసమే చిత్ర విచిత్రమైన వర్ణాల సమూహంగా కాంతి కిరణాలన్నీ ఒక మండలంగా ఏర్పడి ఉదయిస్తున్నది ప్రతి దినమూ. చక్షు ర్మిత్రస్య వరుణస్య అగ్నేః అసలు సూర్యుడేమిటి వరుణుడేమిటి. అగ్ని ఏమిటి. అంతా ఒక్కటే.
ఆ ప్రాద్యావా పృధివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగత స్తస్థుషశ్చ అంతటా వ్యాపిస్తున్న దొకే తేజస్సని చెప్పాము. ఏమిటి. ఎక్కడ. ద్యావా పృథివీ అంతరిక్షం. ఆకాశమూ భూమి రెండింటి నడుమా ఉన్న అంతరిక్షం. దాన్నే రోదసి అంటారు. ఈ మూడు ప్రదేశాలనూ మూడు రూపాలలో వ్యాపించి ఉందది. పృథ్విలో అగ్ని రూపంగా. అంతరిక్షంలో సూర్య రూపంగా. ఆకాశంలో వరుణ రూపంగా. వసురు ద్రాదిత్యులంటే వీరే. ఆకాశంలో చాలా దూరం వెళ్లిపోతే అక్కడ ఆ ప్రకాశం వరుణ అవుతుంది. ఆవృతమవుతుంది. Black holes అవేనేమో. అయినా అవి కూడా ఉన్నాయి గదా. ఉంటే స్ఫురిస్తుంటాయి గదా. అస్తి ఉంటే భాతి ఉన్నట్టే. లేకుంటే అస్తిత్వానికి ప్రమాణం లేదు.
అసలిదంతా బాహ్యార్ధమే. అంతరార్ధం చెప్పుకొన్నా మంటే మండలం స్వరూప స్థితి. కిరణాలు నామరూప క్రియలు. దృశే విశ్వాయ.
Page 98