#


Index

   భద్రం కర్ణేభిః శృణ వామ ఎప్పుడూ సద్విషయం శ్రవణం చేయటానికి. ప్రబ్రవామ శరదశ్శతం - స్తోత్రా లనండి - సంకీర్తన లనండి. గోష్ఠులనండి మరి ప్రవచనా లనండి - నిత్యమూ సద్విషయమైన గోష్ఠి సాగిస్తూనే ఉండాలి మనం. అజీతాః స్యామ శరద శృతం - అంతే కాదు - ఈలోపుగా రోగాలు రొష్టులూ దుర్వార్తలూ అశుభాలూ ఏవీ మామీద దాడి చేయరాదు. అపజయం పాలు కాకుండా నిరాఘటంగా సాగిలి మా జీవితం.

   జ్యోక్చ సూర్యం దృశే య ఉదగా న్మహ తోర్ణవాత్. కల కాలమూ మేమా సూర్య ప్రకాశాన్నే చూస్తుండాలవి మా కోరిక. ఎలా ఉందా మండలం. బ్రహ్మాండమైన ఒక సాగరంలో నుంచి పైకి లేస్తుంటుంది. తూర్పున ఒకటి పశ్చిమాన ఒకటి మన దేశానికి రెండు వైపులా ఉన్నాయి రెండు సముద్రాలు. తూర్పున గదా ఉదయిస్తాడు సూర్యుడు. అలా ఉదయిస్తున్నప్పుడు తూర్పున ఉన్న సముద్ర గర్భంలో నుంచి పైకి వస్తున్నట్టు తోస్తుంది. అస్తమించే టప్పుడు మరలా పడమట ఉన్న సముద్ర గర్భంలో పడి పోతున్నట్టు తోస్తుంది. ఆకాశ మొక బాణలి బోర్లించి నట్టు గదా కనిపిస్తుంది మన కంటికి. అలా ఉన్నప్పుడక్కడికి భూమి అంతమయినట్టు భావిస్తాము. భూమి అంతమైతే ఏముందక్కడ. సముద్రమే గదా. ఇక్కడ సముద్రమంటే మనకు కనపడని ప్రదేశమన్న మాట. కనపడని చోటు నుంచి వచ్చి కనపడని చోటుకు వెళ్లి పోతున్న దా బింబం. వచ్చేటప్పుడు బిభ్రాజ మాన స్సరిరస్యమధ్యాత్. సరిర మంటే సలిలమే.

Page 100