మిత్రస్య దేవస్య – మిత్రుడే మా పాలికి దేవుడు. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉదయిస్తూ సూర్యుడు మమ్మూ మేమా సూర్యుణ్ణి కలుసుకొంటున్నాం. మిత్రుడు గాక మరెవరాయన. చర్షణీ దృతః మాకే గాదు భూమి మీద చరించే ప్రాణులందరినీ ధరించి ఉన్నాడాయన. ఆయన వెలుగు జీవకోటి లోపల ప్రవేశించి ప్రాణ రూపంగా వారిని ధరించి ఉంది. బయట ప్రకాశాన్ని ఇచ్చి దానిలో వారిని నడుపుతున్నది. శ్రవోదేవస్య సానసిం - ఆయన కీర్తిని మేమందు వల్లనే కీర్తిస్తాము. ఎలాంటిదా కీర్తి. సత్యం ఎప్పటికీ నిలిచి ఉండేది. చిత్ర శ్రవస్తమం - చిత్ర విచిత్రంగా భాసించేది. చిత్రమంటే Multicolour అన్ని రంగుల కలయిక. తెలుపు మొదలు నలుపు వరకు ఏడు రంగులూ ఎక్కడ ఉన్నాయి. సూర్యుడిలోనే గదా. అదే గదా ఇంద్రధనుస్సుగా బయట పడేది. అందుకే సప్తాశ్వుడన్నారు సూర్యుణ్ణి. ఆ సూర్యుడి వల్లనే బ్రతికి బట్ట కడుతున్నాము. మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే జాగ్రదవస్థలోనే గదా. అది సూర్య ప్రకాశంలోనే గదా. స్వప్న సుషుప్తులలో అందరూ సమానమే.
మిత్రో జనాన్ యాత యతి ప్రజానన్. అంతేగాదు. మిత్రుడు గనుకనే ఆయన మనకు మార్గదర్శకుడు. జనులందరినీ యాత యతి నడుపుతున్నాడు. నడపాలంటే నడిపేవాడికి తెలివి తేటలుండాలి. మార్గమూ గమ్యమూ అన్నీ తెలిసి ఉండాలి. ప్రజానన్ ఆయన అన్నీ తెలిసినవాడే.
Page 93