ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్. మిత్ర ఓ సూర్య భగవన్. సమర్తః అలా చేసిన ఆ మానవుడు. అస్తు ఇలా ఉండు గాక. ఎలా. అన్ని సత్కర్మల ఫలాన్ని అనుభవించుగాక. ప్రతి ఒక్కడూ చేసే సత్కర్మకు ఫలితమివ్వ వలసిందెవరు. ఆ పరమాత్మే గదా. ఆ పరమాత్మే. సూర్య రూపంగా మనకా ఫలిత మంద జేస్తున్నాడు. పగలంతా మనం కష్టపడి పనిచేస్తే అనంతరం దానివల్ల కలిగే లాభాన్ని పొందుతున్నామా లేదా. దానికి దోహదం చేసేది సూర్య ప్రకాశమే గదా. అదే మనకు ఫలమిస్తున్న దంటే తద్ద్వారా ఫలదాత పరమాత్మే ననుకోండి.
యుస్త ఆదిత్య శిక్షతి వ్రతేన ఇదంతా పరమాత్మ ప్రసాదమనే భావనతో ఉన్నప్పుడే నీకది అనుకూలంగా ఫలిస్తుంది. అందుకే చెబుతున్నాడు. యః ఎవడైతే ఆదిత్య ఓ ఆదిత్యా తే వ్రతే న శిక్షతి - నీ వ్రతంలో శిక్షణ పొందుతుంటాడో. అంటే ఇలాటి నిఃస్వార్ధ బుద్ధితో జీవిస్తాడో. ఆదిత్య ఓ ఆదిత్యా - త్వోతః నీ చేత రక్షితుడు వాడు. ఆదిత్యుడవు గదా నీవు. అంచేత తప్పక రక్షిస్తావు. ఆదిత్య అంటే దగ్గరికి తీసుకొనే వాడని సత్ఫలితాన్ని అందించే వాడని రెండూ అర్థమే. ఆ దాన ప్రదానాలు రెండూ చేసి మనలను కాపాడుతాడని భావం.
Page 92