#


Index

   ఆ మాటకు వస్తే గాయత్రీ దక్షిణామూర్తిః అని కూడా ఉన్నాయా విడ నామాలు. దక్షిణామూర్తి అయ్యాగారే గాదు. అమ్మవారు కూడా. శివశక్తులకు భేదం లేదు గదా.

   ఇలా అష్టమూర్తులతో సాక్షాత్కరిస్తున్నదా దేవత. అంతే కాదు. ఇందు నిబద్ధ రత్న మకుటాం. ఒక రత్న కిరీటం కూడా ఉందమ్మ వారికి. చంద్ర కళావతంసే అన్నారు. చంద్రకళే ఆ కిరీటం. చంద్రుడంటే మనస్సు. దానికి పదహారు కళలు. అందులో పదిహేను అమావాస్యతో సమసిపోతాయి. ప్రాపంచిక వృత్తులే అవి. కాని ఒకటి మాత్రమలా నశించదు. అది చిత్కళ. బ్రహ్మాకార వృత్తి అని భావం. బ్రహ్మమెలా పోదో అలాగే దాని జ్ఞానం కూడా పోదు. బ్రహ్మ స్వరూపమే గదా అది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ అనే గీతా వాక్యానికిదే వివక్షితం. కనుకనే అవి పంచదశి అయితే ఇది షోడశి నిత్య ధ్రువ అని వర్ణించింది నామావళి. పోతే తత్త్వార్ధ వర్ణాత్మికామ్. వర్ణమనే మాటకు రెండర్థాలున్నాయి. శరీరచ్ఛాయా వర్ణమే. అక్షరమూ వర్ణమే. అక్షరాలెన్ని. చతుర్విం శత్యక్షరా. 24 అక్షరాలు గదా గాయత్రీ ఛందస్సుకు. అవే ఆవిడ వర్ణం. ఆకృతి. అక్షరమెప్పుడూ అక్షరమైన తత్త్వాన్ని మనకు బోధిస్తుంది. కనుకనే తత్త్వార్ధ వర్ణాత్మిక ఆవిడ. బ్రహ్మ తత్త్వాన్ని మనకు గుర్తు చేసే అకారాది వర్ణాలే వున్నాయో అవే శరీరాకృతిగా ఉన్నదా శక్తి. శక్తి మూలంగానే గదా శివతత్త్వం మనకు స్ఫురిస్తుంది.

Page 84