#


Index

   ఇంక వరదా భయాంకుశ కశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధారవింద యుగళం. హసైర్వహం తీమ్. అష్ట భుజ ఆవిడ. అష్ట భుజాలతోనూ అష్టాయుధాలు ధరించి ఉంది. ఎనిమిది దివ్యాయుధాలు. ఏవవి. ఒకటి అంకుశం. మరొకటి కశ. అంటే పాశం. రాగస్వరూప పాశాఢ్యా - క్రోధాకారాంకు కుశోజ్జ్వలా అని గదా నామాలు. పాశాంకుశా లేవోగా వప్పటికి. రాగద్వేషాలే. అవే ఆయుధాల రూపంగా ఆవిడ చేతిలో ఉన్నాయి. మూడవది శుభ్రం కపాలం స్వచ్ఛమైన తెల్లని నర కపాలం. కపాల కుండల గదా ఆవిడ. కపాలం ప్రాణ శక్తికి సంకేతం. గదాం గద్ అనేధాతువుకు మాటాడటమని అర్థం. గదతి అంటే వదతి. గద వాక్కుకు సంకేతం. శంఖమంటే చెవులకు సంకేతం. చక్రం. చక్రం లాగా తిరగేది మనస్సు. అధ అరవింద యుగళం - రెండు అరవిందాలు. కమలాలు ఆవిడ నేత్రాలు. మొత్తం మీద వాక్కు ప్రాణం మనస్సు శ్రోత్రం నేత్రం. ఇందులో మనః ప్రాణాలు సూక్ష్మ శరీరం. జీవుడి కుపాధి. వాటి నౌకర్లు శ్రోత్రం నేత్రాదులు జ్ఞానేంద్రియాలు వాగాదులు కర్మేంద్రియాలు. వెరసి ద్వాద శేంద్రియాలూ కలిసి వచ్చాయి ఈ వర్ణనలో.

   ఇవన్నీ ఇప్పుడా మహాశక్తి చేతుల్లో ఉన్నాయంటే ఏమిటర్ధం. వాటిని మనమీద ప్రయోగించనూ గలదు. ఉపసంహరించనూ గలదు. ప్రయోగిస్తే సంసారంలో వచ్చి పడతాం.

Page 85