#


Index

   అన్నప్పుడు కవచమూ ధియో యోనః అంటే నేత్ర త్రయమూ ప్రచోదయాత్తంటే అస్త్రమూ - భూర్భువ స్సువ రంటే దిగ్బంధమూ గ్రహించవలసి ఉంటుంది. అయితే ఇందులో హృదయమూ శిరస్సూ శిఖా అర్థమవుతున్నాయి గాని మిగతా నాలుగూ అంత స్పష్టంగా తెలియటం లేదు. ఏమిటి వాటి కర్ధం. కవచమంటే మన అవయవాల నన్నిటినీ కమ్ము కొని కనిపించే త్వగింద్రియ మనుకోవచ్చు. కవచం లాగా ఈ చర్మ మేగదా శరీరానికి దెబ్బ తగలకుండా కాపాడుతున్నది. మరి నేత్రత్రయ మేమిటి. రెండే గదా మనకున్నవి కండ్లు. మూడెక్కడివి. జ్ఞానాత్మనే అంటున్నాము కాబట్టి మూడవది జ్ఞాననేత్ర మనుకోవచ్చు. కాగా ఇక అస్త్ర మేమిటి బంధమేమిటవి ప్రశ్న. సర్వాత్మనే అని గదా అన్నారు. సర్వమూ నేనే అనుకొంటే అదే ఒక అస్త్రమై విజాతీయమైన భావాలన్నిటినీ పటా పంచెలు చేస్తుంది అదే ఫట్ అనే మాట కర్ధం. ధ్వన్యను కరణ శబ్దమది. మరి భూర్భువస్సు రోమ్మని నలువైపులా చూచామంటే ఆశక్తి ప్రభావంతో ఏ దిక్కునుంచీ ఏ విఘ్నమూ మనకు సోకకుండా వాటిని బంధించినట్టవు తుంది. అదే దిగ్బంధం. స్వాహా అన్నప్పుడన్ని శక్తులూ మన లోపలికి రావాలని భావం. వషట్ హుమ్ వౌషట్ ఫట్టన్నప్పుడు ప్రతీప శక్తులన్నీ మనలోనుంచి ఉచ్ఛాటన మయి పోవాలని భావం. అలా భావిస్తూ పోతే ఆ మహాశక్తి జ్ఞాన నేత్రాన్ని మనకు ప్రసాదించి అజ్ఞాన తిమిరం మన దరి జేరకుండా ఒక బ్రహ్మాస్త్రంగా మారి దిగ్బంధం చేసి అభేద్యమైన కవచమై మనలను కాపాడుతుందని ఇంత గొప్ప అంతరార్ధ ముంది ఇందులో.

Page 81