#


Index

   అంటే దానికి తన ఉపాధిని స్వాధీనం చేయాలి. అది ఎలాగో చెబుతున్నారు వినండి. ఓం తత్సవితుః అంటున్నప్పుడా దేవత బ్రహ్మాకారంగా మన చేతిలోని అంగుష్ఠం మీదికి వచ్చినట్టు భావించాలి. ఓం వరేణ్యం అంటున్నప్పుడది విష్ణ్వాకారంగా తర్జని అంటే చూపుడు వేళ్ల మీద ఉన్నట్టు భావించాలి. ఓం భర్గో దేవస్య అన్నప్పుడది రుద్రాకారంగా మధ్యమమైన వేళ్ల మీద ఉన్నట్టు భావించాలి. ధీమహి సత్యాత్మనే అన్నప్పుడది అనామిక అంటే నాలుగవ వేళ్లమీద ఉన్నట్టు భావించాలి. ధియో యోనః ధియో యోనః అన్నప్పుడు జ్ఞానాత్మకంగా అది చిటికెన వేళ్లమీద ఉన్నట్టు దర్శించాలి. ప్రచోదయాత్త న్నప్పుడది సర్వాకారాంగా కరతలం మీద కర పృష్ఠం మీద అంటే వెల్లకిల బోర్ల త్రిప్పి అక్కడ కూచున్నట్టు చూడాలి. ఏమయిందప్పటికి. 5 వేళ్లను చేతి ముందు వెనుకలనూ త్రిమూర్తులుగా సత్యంగా జ్ఞానంగా సర్వంగా అవతరించిన ఒకే ఒక పరాశక్తి రూపాలుగా భావిస్తూ పోవాలని అర్థం.

   అలాగే ఇప్పుడు డంగన్యాసానికి కూడా అర్థం గ్రహించాలి మనం. ఇక్కడ మొదటి రెండు వరసలూ ఒకటే. అంటే మంత్ర భాగమూ దేవతా రూపమూ ఒక్కటే. తేడా లేదు. కాని కరస్థానాలకు బదులు శరీర స్థానాలను గ్రహించాలి మనం. ఎలాగంటే సవితుః అన్నప్పుడు హృదయ ప్రదేశమూ వరేణ్యమంటే శిరస్సూ భర్గో దేవస్య అంటే శిఖ - ధీమహి

Page 80