#


Index

   అది ఎప్పటికప్పుడీ పాప పంకాన్ని క్షాళితం చేస్తూ పోతుంది. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి - నీవు అకారాది క్షకారంతంగా అన్ని వర్ణాలు వ్యాపించి ఉన్నావు. శబ్ద రూపిణివి. భాషారూపా అని అమ్మవారి పేరు. శబ్దమే అర్థాన్ని చెబుతుంది. పరమార్ధాన్ని మాకు బోధించేది నీవే. ఆయన దేవుడైతే నీవు దేవివి. ప్రకాశ రూపిణివని అర్థం. సంధ్యవు నీవే విద్యవూ నీవే. విమర్శరూపిణీ విద్యా అన్నా రమ్మ వారిని. విద్య వల్లనే వేద్యమనేది అనుభవానికి వస్తుంది. ఎలా వస్తుందది. సరస్వతి. విద్య సరస్వతి. సరస్వతి అంటే ప్రాకుతూ పైకి పోయేదని అర్ధం. క్రింద బడిపోయిన మన మనస్సును క్రమంగా పైకి తీసుకెళ్లేదే విద్య. గాయత్రి సృష్టికి సావిత్రి స్థితికి సరస్వతి లయానికి సంకేతాలు. ఒక్కటే శక్తి దిగి వచ్చే టప్పుడు గాయత్రి అయింది. కాపాడేటప్పుడు సావిత్రి అయింది. సవిత తేజస్సే గదా సావిత్రి అంటే. అది సవిత ఉన్నంత వరకూ స్థితే గదా. అదే అస్తమించేటప్పుడందులోనే లయమయి పోతుంది కాబట్టి సరస్వతి. ఇలా మూడు కాలాల్లో మూడు రూపాలుగా ఉన్నదొకే శక్తి అని భావన చేయాలి. చేస్తే ఓజోసి - నీవే నాకు ఓజస్సు - సహోసి - సహించే శక్తివి. బలమసి- శారీరకమైన పాటవమూ - భ్రాజో సి నా ముఖ వర్చస్సువు కూడా నీవే. దేవానాం ధామ నామాసి దేవతలంటే మన ఇంద్రియాలు. ఇంద్రియాలన్నింటికీ నీవే ధామం. అంటే స్థానం. నామమంటే వాటి వ్యవహారమూ అన్నీ నీవే.

Page 72